చోటా భీమ్‌.. బ్రహ్మానందం

బ్రహ్మానందాన్ని ఎంత పిండుకొంటే అంత వినోదం. సినిమా మొత్తాన్ని త‌న భుజాల‌పై వేసుకొని లాక్కొచ్చేసే స‌మ‌ర్థుడాయ‌న‌. ఓ సినిమాలో బ్రహ్మానందం హాస్యం పండితే.. ఆ సినిమా హిట్టే. ఇప్పుడాయ‌న చోటా బీమ్‌గా క‌నిపించ‌బోతున్నాడు. పిల్లలకు…

బ్రహ్మానందాన్ని ఎంత పిండుకొంటే అంత వినోదం. సినిమా మొత్తాన్ని త‌న భుజాల‌పై వేసుకొని లాక్కొచ్చేసే స‌మ‌ర్థుడాయ‌న‌. ఓ సినిమాలో బ్రహ్మానందం హాస్యం పండితే.. ఆ సినిమా హిట్టే. ఇప్పుడాయ‌న చోటా బీమ్‌గా క‌నిపించ‌బోతున్నాడు. పిల్లలకు అత్యంత ఇష్టమైన యానిమేష‌న్‌ క్యారెక్టర్ చోటా బీమ్‌. అదే పాత్రలో బ్రహ్మానందం వినోదాలు పంచిపెట్టబోతున్నాడు. 

జొన్నల‌గ‌డ్డ శ్రీ‌నివాస‌రావు ద‌ర్శకత్వం వ‌హిస్తున్న చిత్రం ఢీ అంటే ఢీ. ఇందులో బ్రహ్మీ రెండు పాత్రలో క‌నిపిస్తాడు. అందులో చోటా బీమ్ ఒక‌టి. ఈ పాత్ర కోసం కొన్ని గ్రాఫిక్స్ కూడా డిజైన్ చేశార‌ట‌. ఈ సినిమా మొత్తానికి బ్రహ్మీ పాత్రే బ్యాక్ బోన్ అంటున్నారు ద‌ర్శకుడు. మ‌రి చోటా గా బ్రహ్మీ ఎన్ని వినోదాలు పంచిస్తాడో చూడాలి.