సోది, చిలుక జోస్యం, హస్త సాముద్రికం, జ్యోతిష్యం, వాస్తు..‘ఆల్ ఇన్ వన్’ పాకేజ్ డీల్! (రాజకీయ నాయకులకు డిస్కౌంట్ ధమాకా)
నమస్తే కేసీఆర్ సాబ్.. చాల దూరమొచ్చిన్రు?
గదేరాభాయ్.. జరంత పరేశాన్ల ఉన్నా.. నా అభిమానుల నడిగితే నీ తానకు బొమ్మని తోలిన్రు.
నీకు పరేశానీ ఏందన్నా. నువ్వేదనుకుంటే అది మంచిగా జరుగుతున్నది కదా.
జరుగుతాందే. కాదంట లేను.. అయినాగానీ రాత్రుళ్ళు నిద్ర పట్టది. బరాల్ పట్టినాగానీ ఒకటే పీడకలలే.
అగో చెప్పకపోతివిమల్లా.. ఏం పీడకలది?
గదే.. నీయవ్వ.. గా సెక్రటేరియట్ గురించి నీ కెరుకనే గదా.
అవ్ అన్నా! దాన్ని గురించి మస్తు రాస్తున్రు అక్బారోల్లు. గీడ బెట్టాలే గాడ బెట్టాలే అని. గదే నాకు సమజ్ కాకున్నది. గిప్పుడున్న చోటనే ఉంటే ఏమాయె?
అరే నీకు దాని ఫ్లాష్ బాక్ తెలియనట్లున్నది.
ఏంది సార్ గది?
గదేరా భాయ్. గా సెక్రటేరియేట్‌ల చానా కతర్నాక్ వాస్తు దోషమున్నది. ఆడ చీఫ్ మినిస్టర్ గండమున్నదిరా భాయ్.
గట్లనా సార్? నాకెరుకనే లేకపాయె.
నేను చెప్పెడి దేమున్నదిరా. నువ్వే లెక్క చెయ్.. ఎన్టీఆర్ కేమాయె?
ఏమాయె సార్. మంచిగానే కొలువు చేసిండు గదా?
ఏడ జేసిండు? సీట్ల కూసోగానే వాన్ని నాదెళ్ళ గాడు లేపేసిండు గదా.
ఆ అవ్ సార్.. గవర్నర్ రాంలాల్ గాడు ధోకా చేసిండు.
అవ్నా? మరి అది వాస్తు దోషం గాదు?
వాస్తు దోషం గాదన్నా! గది మనిషి ద్రోహం.. మనిషి ద్రోహం ముంగట వాస్తు జాతక బలిమీ నుదిటి రాతా ఏమీ నిలవడ లేవన్నా. గదట్లుండనీ. వాస్తు దోషమైతే మళ్ళా ఎన్టీఆర్ గద్దె ఎట్లేక్కిన్డన్నా?
ఎక్కిండు గానీ మళ్లా కొలువు పాయె గదా! గది వాస్తు దోషం గాకుంటే ఏంది మరి?
గది వాస్తు దోష మెట్లవుతుదన్నా? వాని సొంత మనిషే ఎన్ను పొడిచిండు.
ఎందుకు పొడిచిండు?
రాజకీయాలంటే గంతనే గద్సార్. ఎవల్లెప్పుడు దోకాబాజ్ చేస్తరో కిందకు నీల్లోచ్చేవరకీ తెల్వది.
అరే నీకేం దమాకున్నదా లేదా?గదే వాస్తు దోష మన్నట్లు. ఆ దోష ముంటేనే గట్లవుతది.
అవ్గానీ నీమాట కరెక్టయితే మరి చెన్నారెడ్డి మంచిగానే నడిపించిండు గదా? సీఎం చేసిండు. కేంద్రంల మంత్రి చేసిండు
వాని స్టార్ మంచిగున్నదిరా భాయ్. దాన్దిక్కు కెల్లి వాస్తు దోషం ఎఫ్ఫెక్ట్ పడలే.
నేను చెప్పెడిదీ గదే సార్.. మన స్టార్ మంచిగుంటే ఏ దోషం తోటీ మనకు ఎఫెక్ట్ పడది.
అరే నీకేం దమాకున్నదా లేదా? మన స్టార్ స్ట్రాంగ్ ఉన్నదా లేక వాస్తు దోషం స్ట్రాంగ్ ఉన్నదా అనెడిది మనెకట్ల ఎరుకవుతదిరా?
కొలువు పోయినంక ఎరుకవుతది గద్సార్?
అరే మల్లి గట్లనే అంటావ్? పోయినంక ఎరుకయినా చేసెడిదేమున్నదిరా? చంద్ర బాబు కేమాయె? కొలువు ఊడినాక ఎరుకయింది. ఎరుకయినాగాని పదేళ్ళు ఇంట్లోకూసుండా లేదా?
అవ్ సార్. పదేళ్ళు ఇంట్లో కూసున్నా గాని మళ్ళీ సేఎమ్ అయి గదే సెక్రటేరిఎట్‌ల కూసుండు గదా?
కూసున్నగానీ ఏమయినా చేయగలుగుతుండా?పైసల్లేక పరేశాన్ల ఉన్నడు. గంతెన్దుకు? రాజసేకర్రెడ్డి కేమాయె?
వానికేమాయె సార్? రెండు సార్లు సేఎమ్ చేసిండు. ఆదా హైదరాబాద్ని అమ్మేసి లక్షల కోట్లు కమాయిన్చిండు. వానికి గిన్తయినా వాస్తు దోషం తలగక పాయె.
తగలక పోవుడేంది? చివరి కేమాయె. యాక్సిడెంట్‌ల పోయిండు కదా? బైగన్మే మిల్గయాన?
పోతే ఏమాయే సారూ.. కోట్లు కొడుక్కిచ్చి పోయిన్డుగదా? గంతకంటే మన తాన రాజకీయ నాయకులకి వేరే టార్గెట్ ఏముంటది?
ఇగో ఇదంతాగాదుగానీ నాకు ఎసంటి జగా కావాల్నంటే వాస్తు దోషం ఉండొద్దు. నా స్టార్ కి మంచిగా సూటవ్వాలే. అల్లుళ్ళు కొడుకులూ ఎవ్వల్లూ ఎన్నుపోటు పొడవద్దు. పార్టీల తిరుగు బాట్లున్డొద్దు. నేనేం జెప్తే అదే జరగాలె. నేనేం జేయమంటే అందరూ గదే జేయాలే. ప్రజలందరూ ఎప్పటికీ నన్నే దేముడనుకోవాలె. గసంటి జాగా ఏడున్నదో నా జాతకం వాస్తు స్టారూ న్యూమరాలజీ అన్నీ చూసి చెప్పు. గేడున్నా గాని, ఎంతయినా గాని కొంటా.
గసంటి జాగా ఒకే ఒకటున్నది సార్.
ఆ.. ఉన్నదా ఏడ? జల్దీ జెప్పు?
అంగారక గ్రహంలో సార్!
అవ్రా భయ్!
యర్రం శెట్టి సాయి