ఇక తెలంగాణ సీఎమ్ రాజకీయం

ముందు తెలంగాణ..దానికోసం రకరకాల రాజకీయాలు. ఊరింతలు..కేరింతలు..ఆపై ఇప్పుడు అధికారం..అందుకోసం మళ్లీ రాజకీయాలు..ఊరింతలు..ఆశల ఊయలలు.. ఇదీ తెరాస, కాంగ్రెస్, తెలుగుదేశం తెలంగాణలో ఆడుతున్న రాజకీయ క్రీడ. పునర్మిర్మాణం..ఎస్ సి లకు మఖ్యమంత్రి పదవి, కాదు కాదు,…

ముందు తెలంగాణ..దానికోసం రకరకాల రాజకీయాలు. ఊరింతలు..కేరింతలు..ఆపై ఇప్పుడు అధికారం..అందుకోసం మళ్లీ రాజకీయాలు..ఊరింతలు..ఆశల ఊయలలు.. ఇదీ తెరాస, కాంగ్రెస్, తెలుగుదేశం తెలంగాణలో ఆడుతున్న రాజకీయ క్రీడ. పునర్మిర్మాణం..ఎస్ సి లకు మఖ్యమంత్రి పదవి, కాదు కాదు, బిసిలకు ముఖ్యమంత్రి పదవి,. ఇదీ తెలుగాణలో నడుస్తున్న చరిత్ర. ఇదంతా ఏమీ పాలుపోక, ఇదుకోసమేనా తాము ఉద్యమించింది అని ఏమి అర్థం కాక సామాన్యుడు తలపట్టుకునే పరిస్థితులు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. సరే గెలుపే ముఖ్యం కాబట్టి రాజకీయ పార్టీలు తాజాగా దానికోసం ఆడుతున్న సిఎం పదవి రాజకీయం అని సరిపెట్టకొవాల్సిందే.

సిఎం పదవి బూచి చూపి తెలంగాణలో లబ్దిపొందాలని టిఆర్ఎస్ గత కొన్నేళ్ల క్రితమే వ్యూహ రచన చేసి తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానంటూ ప్రకటించింది. తీరా తెలంగాణ ఏర్పడిఅధికారంలోకి రావడం ఖాయం అన్న ధీమా టిఆర్ఎస్ లో పెరగడంతో అధికార కాంక్ష ఒక్కసారిగా కేసిఆర్ లో పెరిగిపోయింది.. సిఎమ్ పదవి దళితుడికి ఇస్తానన్న కేసిఆర్ నిర్ణయంలో స్పష్టమైన మార్పు వచ్చి, ఆ పదవి తానే తీసుకోబోతు్నట్లు మాట తీరు మారిపోయింది. వరాలు కురిపించడం, సిఎమ్ లెవెల్లో మాట్లాడడం మొదలెట్టేసారు.. దీంతో ఆయన ప్రత్యర్థి వర్గం ఇదే అదనుగా భావించి ఆ విషయంలోనే తెలంగాణలో కేసిఆర్ ను ఇరుకున పెట్టి లబ్దిపొందాలన్న ఎత్తుగడ వేసాయి.

ఇలాంటి వాటిలో సహజంగానే ముందుండే టిడిపి అధినేత చంద్రబాబు తెలంగాణలో అధిక సంఖ్యలో ఉండే బిసిలపై గురిపెట్టారు. తెలంగాణకు ముఖ్యమంత్రిగఅ బిసిని చేస్తానని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. దీంతో ఇరకాటంలో టిఆర్ఎస్ పడి సర్దుబాటు ఎలా చేసుకోవాలా అని ఆలోచిస్తున్న తరుణంలోనే టిఆర్ఎస్ తో దోస్తానా కటీఫ్ అయిందని భావిస్తున్న కాంగ్రెస్ రంగంలోకి దిగింది.  అటు టిడిపికి, ఇటు టిఆర్ఎస్ కు చెక్ పెట్టే వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది. అంతటితొ ఆగకుండా సిఎమ్ అభ్యర్థి ఎంపికకు కూడా శ్రీకారం చుట్టేసింది తీంతో తెలంగాణ రాజకీయాలు ముఖ్యమంత్రి పదవి చుట్టు ఫోకస్ అయ్యాయి.

కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ కదా, జైరాంరమేష్ వాఖ్యలను కాంగ్రెస్ ప్రత్యర్థులు ఎండకట్టక ముందే అదే పార్టీకి చెందిన సీనియర్ నేత ఆ వాఖ్యలు ఆయన సొంతం, కాంగ్రెస్ బిసికే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అంటూ జైరాంరమేష్ పై ధ్వజమెత్తారు. ఇంకేం కావాలి కాంగ్రెసోడే కాంగ్రెస్ ను విమర్శించుకున్నాక ప్రత్యర్థులు ఆగుతారా, అందుకే వెంటనే జైరాంరమేష్ ఎవరు? ఇలా ప్రకటించడానికి, అదంతా వట్టి భూటకం, నిజంగా కాంగ్రెస్ కు అంత మంచి బుద్ది ఉంటే ఆ పార్టీ అధినేత్రి సోనియా ప్రకటించాలి అంటూ విపక్షాలు దుమ్మెత్తి పోయడం ఆరంభించాయి. దీంతో నిన్నటి నుంచి తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి అంశం రాజకీయంగా దుమారం లేపడం మొదలు పెట్టింది.

ఇక  ఈవిషయంలో ఇరకాటంలో పడ్డ టిఆర్ఎస్ వెంటనే తేరుకుని నష్టనివారణకు పూనుకుంది. దళితుడిని సిఎం చేయాలన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్ కు గుర్తు వచ్చిందా, మేం ఇంకా సిఎం పదవి విషయంలో తమ నిర్ణయం మార్చుకున్నట్టు ఎక్కడ ప్రకటించాం, ఎన్నికలయ్యే దాకా ఆగండి తాము ఏం చేస్తామో మీకే తెలుస్తుంది అంటూ డొంక తిరుగుడు ప్రకటనలు మొదలు పెట్టారే తప్ప దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తాం, అదే మా స్టాండు అని మాత్రం ఇంకా స్పష్టంగా ప్రకటించలేదు.

ముఖ్యమంత్రి పదవి ఒక్క తెలంగాణకే ఉంటుందా, సీమాంద్రకు ముఖ్యమంత్రి ఉండరా, అటువంటప్పుడు తెలంగాణలో ఒక విధానం, సీమాంద్రలో ఒక విధానం ఎందుకు టిడిపి అక్కడ కూడా బిసికే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించాలి అంటూ ప్రత్యర్థులు టిడిపి పై విరుచుకు పడడం మొదలెట్టారు. ఇక్కడేమో సామాజిక తెలంగాణ, అక్కడేమో స్వర్ణాంధ్రనా, ఇదేమి పద్దతి అక్కడ సామాజికం అవసరం లేదా, బడుగు, బలహీన వర్గాలు అక్కడేమైనా అభివృద్ది చెందారా అంటూ టిడిపిని ఆ పార్టీ ప్రత్యర్థులందరు ఎండగట్టడం మొదలెట్టారు. రెండు రాష్ట్రాల్లో అభివృద్ది ఎలా చేస్తారో చెప్పడం మానేసి ఇప్పుడు సిఎం పదవిని పట్టుకుని తెగ కొట్లాడం చూస్తున్న ప్రజలు చివరకు ఎవరికి. ఏ పార్టీకి ఎలా బుద్ది చెబుతారో అన్నది వేచి చూడాల్సిన సంగతి.

చాణక్య

[email protected]