అక్కినేని మూడు తరాల సినిమాను ఉగాది కి విడుదల చేయాలని నాగార్జున మనసుపడ్డాడు. కానీ అది సాధ్యమేనా అన్న అనుమానం కలుగుతోంది. ఇంక కేవలం 20 రోజుల సమయం మాత్రమే వుంది. పైగా లెజెండ్, రౌడీ లాంటి సినిమాలు వస్తాయని టాక్. మనం సినిమాకు ఇంకా అడియో ఫంక్షన్ కూడా చేయలేదు.
Advertisement
పైగా ఉగాది సోమవారం నాడు. ఆరోజు విడుదల చేస్తే, వారాంతం వరకు పైరసీని తట్టకుని సినిమా థియేటర్లలోవుండాలి. ఇవన్నీ సమస్యలే. అన్నపూర్ణ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా జరుగుతున్నాయి. అందువల్ల సమయం పడుతుంది. బహుశా ఉగాదికి అడియో అందించి, సినిమా ఏప్రిల్ చివర్న తెస్తారేమో?