ధోనీకి సినిమా ప్లాన్లు ఉన్నాయా?

టీమిండియా క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీకి సినిమా డ్రీమ్స్ ఉన్నాయా? సినిమా స్టార్ల‌ను త‌ల‌ద‌న్నే ఫాలోయింగ్ ను సంపాదించిన ధోనీనే.. స్వ‌యంగా సినిమాల్లో న‌టిస్తే.. ఎలా ఉంటుందో కానీ, ప్ర‌స్తుతానికి ధోనీకి మాత్రం…

టీమిండియా క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీకి సినిమా డ్రీమ్స్ ఉన్నాయా? సినిమా స్టార్ల‌ను త‌ల‌ద‌న్నే ఫాలోయింగ్ ను సంపాదించిన ధోనీనే.. స్వ‌యంగా సినిమాల్లో న‌టిస్తే.. ఎలా ఉంటుందో కానీ, ప్ర‌స్తుతానికి ధోనీకి మాత్రం అలాంటి ఉద్దేశం లేద‌ట‌!

ఏదో యాడ్స్ వ‌ర‌కూ ఫ‌ర్వాలేదు కానీ, సీరియ‌స్ గా సినిమాల్లో న‌టించే ఉద్దేశం త‌న‌కు లేద‌ని ధోనీ స్ప‌ష్టం చేశాడు. ఇప్ప‌టికే ప‌లువురు ఇండియ‌న్ క్రికెట‌ర్లు బాలీవుడ్ వైపు తొంగి చూశారు. సినిమాల్లో క‌నిపించారు. అజ‌య్ జ‌డేజాతో మొద‌లు పెడితే, త‌మ గ్లామ‌ర్ ను ఇలా ఉప‌యోగించిన వారు ప‌లువురు ఉన్నారు.

త‌మిళ‌నాడుకు చెందిన మాజీ ఓపెన్ శ‌ఠ‌గోప‌న్ ర‌మేష్ అనేక సినిమాల్లో న‌టించాడు. సూప‌ర్ గ్లామ‌ర్ తో ఉండే ర‌మేష్ హీరోగా కాకుండా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు వేషాల్లో క‌నిపించాడు. ఇక ఇప్పుడు కూడా తెర మీద క‌నిపించ‌డానికి ఆరాట‌ప‌డుతున్న క్రికెట‌ర్లున్నారు. 

హ‌ర్భ‌జ‌న్ సింగ్, శ్రీశాంత్ లు సినిమాల్లో కెరీర్ ను వెదుక్కొంటున్నారు. ఇక న‌వ్ జ్యోత్ సింగ్ సిద్ధూ క్రికెట్ కు ధీటుగా బుల్లితెర‌పై ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడాయ‌న రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నాడు.

వారంద‌రి క‌థా ఒక ఎత్తు అయితే ధోనీ ది మ‌రో ఎత్తు. యాడ్స్ కోసం ర‌క‌ర‌కాల వేషాల‌ను వేశాడు ధోనీ. సినిమా హీరోలు క‌నిపించిన‌ట్టుగా వెరైటీ గెట‌ప్స్ లో ధోనీ ఆ పాత్ర‌ల‌ను పండించాడు. అయితే సినిమాల్లో అలా స‌త్తా చూపించ‌డంపై మాత్రం ధోనీకి ఆస‌క్తి లేద‌ట‌. ఆ ప‌నిని త‌ను బాలీవుడ్ హీరోల‌కే వ‌దిలేస్తున్న‌ట్టుగా 40 యేళ్ల ధోనీ అంటున్నాడు. వారు ఆ ప‌ని బాగా చేస్తున్నార‌ని, త‌న‌కు బాలీవుడ్ లో కెరీర్ ను వెదుక్కునే ఉద్దేశం లేద‌ని చెప్పాడు.

ఇక అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన ధోనీ, ఐపీఎల్ లో ఇంకా కొన‌సాగే ఉద్దేశాన్ని చాటాడు. వ‌చ్చే ఏడాది ఐపీఎల్ లో చెన్నై లో ఆడే ఆశాభావాన్ని ధోనీ వ్య‌క్తీక‌రించాడు.