సచిన్‌, గేల్‌.. ఒకే రోజు ‘డబుల్‌’.!

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సరిగ్గా ఐదేళ్ళ క్రితం ఇదే రోజు (అంటే ఫిబ్రవరి 24, 2010) సౌతాఫ్రికాపై కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీని నమోదు చేశాడు. అప్పటిదాకా ప్రపంచ క్రికెట్‌లో ఇంకెవరూ డబుల్‌…

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సరిగ్గా ఐదేళ్ళ క్రితం ఇదే రోజు (అంటే ఫిబ్రవరి 24, 2010) సౌతాఫ్రికాపై కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీని నమోదు చేశాడు. అప్పటిదాకా ప్రపంచ క్రికెట్‌లో ఇంకెవరూ డబుల్‌ సెంచరీ కొట్టలేదు. వన్డే హిస్టరీలో తొలి డబుల్‌ సెంచరీని నమోదు చేసిన క్రికెటర్‌గా సచిన్‌ రికార్డులకెక్కిన రోజు అది. 200 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు సచిన్‌ ఆ మ్యాచ్‌లో.

ఇక, సచిన్‌ తర్వాత ఇండియా తరఫున డబుల్‌ సెంచరీని బాదిన వారిలో వీరేందర్‌ సెహ్వాగ్‌, రోహిత్‌ శర్మ వున్నారు. రోహిత్‌ శర్మ ఏకంగా రెండుసార్లు డబుల్‌ సెంచరీ బాదేశాడు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ ఇప్పటికీ రోహిత్‌ శర్మదే. వన్డేల్లో రెండు డబుల్‌ సెంచరీలు కొట్టిన హీరో రోహిత్‌ శర్మనే.

తాజాగా క్రిస్‌ గేల్‌ డబుల్‌ సెంచరీ బాదాడు. అది కూడా, సచిన్‌ టెండూల్కర్‌ తొలిసారిగా వన్డేల్లో డబుల్‌ సెంచరీని నమోదు చేసిన రోజే కావడం మరో విశేషం. ఇక, వరల్డ్‌ కప్‌ పోటీల వరకూ అయితే క్రిస్‌ గేల్‌దే అత్యధిక పరుగుల రికార్డ్‌. ఎప్పుడో ఇరవయ్యేళ్ళ క్రితం సౌతాఫ్రికా ఆటగాడు కిర్‌స్టెన్‌ బాదిన 188 పరుగులే వరల్డ్‌ కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌. దాన్ని క్రిస్‌గేల్‌ అధిగమించాడు.