టీ20ల్లో చరిత్ర సృష్టించిన షకీబ్‌ అల్‌ హసన్‌!

బంగ్లాదేశ్‌ స్టార్ ఆల్‌రౌండర్‌, సీనియర్ ప్లేయర్ షకీబ్‌ అల్‌ హసన్‌ టీ20లో అరుదైన ఘనత సాధించాడు. అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాడిగా నిలిచారు. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్‌లో ష‌కీబ్ 5…

బంగ్లాదేశ్‌ స్టార్ ఆల్‌రౌండర్‌, సీనియర్ ప్లేయర్ షకీబ్‌ అల్‌ హసన్‌ టీ20లో అరుదైన ఘనత సాధించాడు. అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాడిగా నిలిచారు. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్‌లో ష‌కీబ్ 5 వికెట్లు తీసి, ఈ ఘనతను అందుకున్నాడు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు న్యూజిలాండ్ బౌల‌ర్ టిమ్ సౌథీపై ఉన్న రికార్డును ష‌కీబ్ అధిగ‌మించారు.

2006లో జింబాబ్వేతో జ‌రిగిన‌ టీ20 ఫార్మాట్లో అడుగుపెట్టిన షకీబ్‌ ఇప్పటి వరకు జరిగిన అన్ని టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లోనూ పాల్గొనడం విశేషం. ఇప్పటి వరకు బంగ్లా తరఫున 114 మ్యాచ్‌లు ఆడాడు. దీంతో పాటు బంగ్లాదేశ్‌ తరపున 300 వన్డే వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. టీ20ల్లో ష‌కీబ్ నెంబ‌ర్1 ఆల్ రౌండ‌ర్ గా కొన‌సాగుతున్నారు. 

ష‌కీబ్ 136 వికెట్లు తీయ‌గా ఆ త‌ర్వాతి స్ధానాల్లో సౌథీ(134), ర‌షీద్ ఖాన్(101), సోదీ(114), మ‌లింగ‌(107), షాదాన్ ఖాన్(101), ముస్తాఫిజుర్(100)లు అంతర్జాతీయ టీ20లో ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా ఉన్నారు.