సెమిస్ ఇంగ్లండ్ తోనా.. కివీస్ తోనా..?

ప్రపంచకప్ సెమిస్ బెర్త్ లు దాదాపు ఖరారు అయినట్టే. ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ లు దాదాపుగా సెమిస్ కు చేరినట్టే. ఒకవేళ బంగ్లాదేశ్ మీద పాక్ 316 పరుగుల తేడాతో విజయం సాధిస్తే..…

ప్రపంచకప్ సెమిస్ బెర్త్ లు దాదాపు ఖరారు అయినట్టే. ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ లు దాదాపుగా సెమిస్ కు చేరినట్టే. ఒకవేళ బంగ్లాదేశ్ మీద పాక్ 316 పరుగుల తేడాతో విజయం సాధిస్తే.. న్యూజిలాండ్ స్థానంలో పాక్ సెమిస్ బెర్త్ పొందుతుంది. అయితే ఇంతవరకూ వన్డే చరిత్రలో అలాంటి విజయం సాధించిన జట్లు లేనే లేవు. కాబట్టి.. కివీస్ కు సెమిస్ బెర్త్ ఖరారు అయినట్టే.

ఆ సంగతలా ఉంటే.. సెమిస్ లో టీమిండియాకు ప్రత్యర్థి ఎవరనేది ఆసక్తిదాయకంగా మారింది. టీమిండియాకు ఇంకా ఒక లీగ్ మ్యాచ్ మిగిలే ఉంది. అది శ్రీలంకతో. విజయావకాశాలు ఇండియాకే ఎక్కువ. ఆ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే.. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఉన్న స్థానంలోనే నిలిస్తే.. ఇండియా జట్టు సెమిస్ లో ఇంగ్లండ్ ను ఎదుర్కొనాల్సి ఉంటుంది.

అయితే సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ మిగిలే ఉంది. ఆ మ్యాచ్ లో ఆసీస్ గెలిస్తే.. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ సెమిస్ మ్యాచ్ ఖరారు అయినట్టే. అలాకాకుండా అందులో ప్రోటిస్ జట్టు గనుక గెలిస్తే.. ఇండియాకు సెమిస్ లో ప్రత్యర్థి మారిపోయే అవకాశాలుంటాయి.

ఆస్ట్రేలియా గనుక సౌతాఫ్రికా చేతిలో ఓడి, శ్రీలంకపై ఇండియా విజయం సాధిస్తే.. టీమిండియా పాయింట్ల పట్టికలో నంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. అప్పుడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 

ఇండియాకు సెమీఫైనల్ లో ప్రత్యర్థి ఎవరు అనే అంశాన్ని ప్రధానంగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాల మ్యాచ్ డిసైడ్ చేయబోతూ ఉంది. శ్రీలంక మీద ఎలాగూ ఇండియా గెలుస్తుంది అనుకుంటే.. అప్పుడు ప్రత్యర్థి న్యూజిలాండ్. లేకపోతే ఇంగ్లండ్.

ఏదేమైనా మూడోసారి వన్డే ప్రపంచకప్ నెగ్గే సువర్ణావకాశం ఇండియాకు ప్రధానంగా రెండు మ్యాచ్ ల దూరంలో ఉంది. ఆశావహ ధోరణితో కనిపిస్తున్న భారత జట్టు.. ఈసారి ప్రపంచకప్ విజేతగా నిలవడం సుసాధ్యమైన విషయమే.

బీజేపీలోకి చేరాలనే ఉంది కానీ, క్యాడర్ రాదే!