రాహుల్ ద్రావిడ్‌లా క్రీజ్‌లో పాతుకుపోయి, ప్రత్యర్థి బౌలర్‌కి చుక్కలు చూపించగలిగే ఆటగాడు ప్రస్తుత క్రికెట్లో ఎవరైనా వున్నారా.? షేన్‌వార్న్, అనిల్ కుంబ్లేలా ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌కి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేయగలిగే బౌలర్ భవిష్యత్తులో క్రికెట్లో కనిపిస్తాడా.? సచిన్ టెక్నిక్, సంగక్కర, జయవర్ధనే క్లాసిక్ స్ట్రోక్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచ క్రికెట్లో ఎంతో అందం వుండేది ఒకప్పుడు. బహుశా ఆ అందం ఇకపై కన్పించకపోవచ్చు. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ ఒకప్పుడు అద్భుతాలు చోటుచేసుకునేవి.
బ్యాటింగ్ వైపునుంచిగానీ, బౌలింగ్ వైపు నుంచిగానీ ఇకపై ‘అద్భుతం’ కనిపించదు సరికదా, ఇటు బ్యాట్స్‌మన్.. అటు బౌలర్లు బెంబేలెత్తిపోయే పరిస్థితులైతే సమీప భవిష్యత్తులో కన్పించనున్నాయి. సమీప భవిష్యత్తులో కాదు. గత కొంతకాలంగా క్రికెట్లో జరుగుతున్నది అదే. బంతిని గట్టిగా బాదడమొక్కటే పరమార్ధం.. అన్నట్లు వ్యవహరిస్తున్నారు ఇప్పుడు కొందరు బ్యాట్స్‌మెన్. బ్యాట్స్‌మెన్‌కి దొరక్కుండా బంతులు వేయడం తప్ప వేరే ఛాన్స్ తీసుకోలేని పరిస్థితి బౌలర్లది. అలా క్రికెట్లో అనూహ్య మార్పులొచ్చేశాయి.
ఏ జట్టు అయినా మైదానంలోకి దిగకముందు ప్రత్యేకంగా వ్యూహాలు రచించుకోవడానికే వీల్లేకుండా పరిస్థితులు మారిపోవడం చూస్తుంటే, ఫలానా ఆటగాడు ఫలానా టీమ్‌పై అభిమానం పెంచుకోడానికీ క్రికెట్ అభిమానులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. క్రికెట్లో గాలి వాటం విజయాలకు ఆస్కారం వుండేది కాదు ఒకప్పుడు. కానీ, ఇప్పుడు అన్నీ గాలి వాటం విజయాలే.
300 స్కోర్ వన్డేల్లో అద్భుతం. సెంచరీ కొట్టడం ఏ ఆటగాడికైనా డ్రీమ్. ఇప్పుడు డబుల్ సెంచరీ అలవోకగా బాదేస్తున్నారు.. 400 స్కోర్ కూడా పెద్దగా లెక్కలోనిది కాదు ఏ జట్టుకైనా. చిన్న చిన్న జట్లూ బంతిని బలంగా బాదడమ్మీదనే దృష్టిపెడుతున్నాయి. బ్యాట్స్‌మన్ అయితే హిట్టింగ్ వచ్చి వుండాలి.. అంతే తప్ప, బౌలర్ గురించి అసలు ఆలోచించడమే లేదు ఎవరైనా.
మొత్తంగా చూస్తే క్రికెట్ నుంచి క్వాలిటీ కనుమరుగైపోయింది. నిన్న మొన్నటిదాకా కొందరు సీనియర్లు తమ టెక్నిక్‌తో క్రికెట్‌కి గౌరవం తెచ్చారు. ఇకపై అలాంటి పరిస్థితుల్ని చూడలేం. క్రికెట్‌కి ఎవరైనా గుడ్ బై చెప్పేస్తోంటే, ఓ శకం ముగిసిపోయింది.. క్రికెట్‌కి తీరని నష్టం జరిగింది.. అనుకుంటున్నాం తప్ప, ఇలాంటోడు మళ్ళీ వస్తాడు.. అని కనీసం ఆలోచించలేని పరిస్థితి. క్రికెట్‌కి ఇది నిజంగానే బ్యాడ్ టైమ్.