సాయి ధరమ్‌ తేజ్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ

ఏది ముందు వచ్చినా హ్యాపీ… రెండు సినిమాలపై అంత కాన్ఫిడెన్స్‌! -సాయి ధరమ్‌ తేజ్‌ Advertisement చిరంజీవి తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ముగ్గురు పెద్ద స్టార్స్‌ అయ్యారు. ప్రస్తుతం తెలుగు…

ఏది ముందు వచ్చినా హ్యాపీ… రెండు సినిమాలపై అంత కాన్ఫిడెన్స్‌! -సాయి ధరమ్‌ తేజ్‌

చిరంజీవి తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ముగ్గురు పెద్ద స్టార్స్‌ అయ్యారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్‌ సిక్స్‌ హీరోస్‌లో వాళ్లే ముగ్గురున్నారు. ఈ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడంటే డెఫినెట్‌గా అందరి దృష్టి అతనిపై ఉంటుంది. అలాగే ఇంత మంది స్టార్లు సెట్‌ చేసిన బార్‌ రీచ్‌ అవ్వాలనే టార్గెట్‌ ఆ హీరోకీ ఉంటుంది. చిరంజీవి`నాగబాబు`పవన్‌కళ్యాణ్‌ల మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ మొదటి సినిమా ఇంకా రిలీజ్‌ కాలేదు. కానీ అప్పుడే అతని మూడవ చిత్రం మొదలైంది. ఈ మెగా హీరోపై ఆల్రెడీ కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ బాగా పెరిగిపోయాయని చెప్పడానికి ఇంతకంటే ఎక్స్‌ప్లెనేషన్‌ అక్కర్లేదు. వైవిఎస్‌ చౌదరి తీసిన ‘రేయ్‌’ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని విడుదల లేట్‌ అవుతోండగా… సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన రెండో చిత్రం ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ఈ నెల 14న విడుదలకి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సాయి ధరమ్‌ తేజ్‌తో ‘గ్రేట్‌ఆంధ్ర’ చేసిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ ఇది…

Watch Sai Dharam Tej Exclusive Interview

  • హీరో అవ్వాలనే ఆలోచన మీలో ఎప్పుడు స్టార్ట్‌ అయింది. హీరో అవ్వాలని ఎప్పుడు డిసైడ్‌ అయ్యారు? 

డిగ్రీ కంప్లీట్‌ అయిన తర్వాత మాస్టర్స్‌ చేయాలని అనుకుంటూ ఉండగా… చిన్న థాట్‌ వచ్చింది. ‘నేను ఎందుకు యాక్టర్‌ అవకూడదు’ అని. ముందయితే డాక్టర్‌ అవుదామని అనుకున్నాను. డాక్టర్‌గా నన్ను నేను ఇమాజిన్‌ చేసుకున్నాను. స్టెతస్కోప్‌ పట్టుకున్నట్టు, కోట్‌ వేసుకున్నట్టు నన్ను నేను చూసుకుంటే సెట్‌ అవ్వలే. తర్వాత లాయర్‌ అవుదామని అనుకున్నాను. అది కూడా నా ఇమాజినేషన్‌లో అంత కరెక్ట్‌గా అనిపించలేదు. అలా కన్‌ఫ్యూజన్‌లో ఉండగానే నా స్టడీస్‌ అయితే కంప్లీట్‌ అయిపోయాయి. ఎంబీఏ పూర్తి చేసాను. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే.. ఒక యాక్టర్‌ అయితే డాక్టర్‌గా నటించవచ్చు, లాయర్‌గా చేయవచ్చు… మనల్ని మనం ఎలా చూడాలనుకుంటే అవన్నీ నటుడిగా చేసేయవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా నైట్‌ టు ఫైవ్‌ జాబ్‌ చేయడం నా వల్ల కాదని ముందే తెలిసిపోయింది. సో.. యాక్టర్‌ అవుదామని నిర్ణయించుకున్నాను. 

  • అంతేనా.. చిరంజీవిగారి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉంది కాబట్టి.. హీరో అయిపోవడం ఈజీ అనుకున్నారా?

అదే చెప్తున్నానండీ… నేను యాక్టర్‌ అవుదామని అనుకున్నాను కానీ హీరో అవుదామని ఈ కెరీర్‌ ఎంచుకోలేదు. ఒక యాక్టర్‌గా ఎస్టాబ్లిష్‌ అయిన తర్వాత అవకాశాలొస్తే హీరోగా చేద్దామని అనుకున్నానేమో కానీ ముందు ఈ ప్రొఫెషన్‌ ఎంచుకున్నప్పుడు మాత్రం హీరో అయిపోవాలనేది నా ఎయిమ్‌ కాదు. అండ్‌ చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి రావడం వల్ల ఈజీ అయిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే… ఆయన బ్యాక్‌గ్రౌండ్‌ ఉండడం పెద్ద రెస్పాన్సిబులిటీ. ఆల్రెడీ బన్నీ, చరణ్‌ ఇద్దరూ బార్‌ చాలా పై లెవల్లో సెట్‌ చేసి పెట్టారు. మా ఫ్యామిలీ నుంచి కొత్తగా వచ్చే వాళ్లకి వాళ్లు ఒక బార్‌ సెట్‌ చేసారు. నేను దానిని రీచ్‌ అవ్వాలనే అనుకుంటున్నాను కానీ దానిని కిందకి దించకూడదనుకుంటున్నాను. అందుకే ప్రోపర్‌ కేర్‌ తీసుకునే ఈ రంగంలోకి వచ్చాను. చాలా యాక్టింగ్‌ స్కూల్స్‌కి వెళ్లాను. సత్యానంద్‌, బారీ జాన్‌, అరుణ`భిక్షు గారి దగ్గర ట్రెయినింగ్‌ తీసుకున్నాను. 

  • యాక్టర్‌ అవుదామనే ఐడియాని ముందుగా మీ ఫ్యామిలీలో ఎవరి దగ్గర ఎక్స్‌ప్రెస్‌ చేసారు?

ముందుగా కళ్యాణ్‌ మావయ్యతో చెప్పాను. ఎందుకంటే నాకు చిన్నప్పట్నుంచీ కళ్యాణ్‌ మావయ్యతో కంఫర్ట్‌ లెవల్‌ ఎక్కువ. అందుకని ఆయనకే ముందు చెప్పాను. చెప్పగానే.. ‘అన్నయ్యకి చెప్పావా?’ అని అడిగారు. లేదంటే… ‘ముందు వెళ్లి అన్నయ్యతో చెప్పు’ అన్నారు. చిరంజీవిగారికి చెప్పి బ్లెస్సింగ్స్‌ తీసుకున్నాను.. తర్వాత నాగబాబుగారికి చెప్పాను. ముగ్గురు మావయ్యలకి చెప్పిన తర్వాత మా మదర్‌తో చెప్పాను. 

  • మీ కెరీర్‌ పరంగా పవన్‌కళ్యాణ్‌ రోల్‌ ఏమైనా ఉంటుందా లేక ఆయనేమీ పట్టించుకోరా?

లేదండీ… ఆయన రోల్‌ ఏమీ ఉండదు. ఆయన ఒక గైడిరగ్‌ ఫోర్స్‌. ఒక గురువు ఎలా అయితే తన స్టూడెంట్‌ని గైడ్‌ చేస్తారో అలాగే ఆయన నన్ను గైడ్‌ చేసారు.

Watch Sai Dharam Tej Exclusive Interview

  • మీ ముగ్గురు మావయ్యలతో మీకెలాంటి బాండిరగ్‌ ఉంది?

ముగ్గురు మావయ్యలతోను నాకు చాలా మంచి అనుబంధం ఉందండీ. వాళ్లు ముగ్గురూ కూడా నా లైఫ్‌లో ఇంపార్టెంట్‌ రోల్‌ ప్లే చేసారు. స్టడీస్‌ వైజ్‌, కెరియర్‌ ఛూజ్‌ చేసుకునే విషయంలో… ఈ కెరియర్‌ ఎంచుకున్న తర్వాత… ఇలా ప్రతి దశలో ముగ్గురి ఇన్‌ఫ్లుయన్స్‌ నాపై బాగా ఉంది. చిన్నప్పుడు చదువు విషయంలో నాగబాబు కేర్‌ తీసుకునే వారు. ఇంటర్‌, డిగ్రీ టైమ్‌లో బాగా చదవాలి అని చిరంజీవిగారు నన్ను సపోర్ట్‌ చేసారు. కెరియర్‌ పరంగా డెసిషన్‌ తీసుకున్నప్పుడు కళ్యాణ్‌గారు ఫుల్‌ సపోర్ట్‌ ఇచ్చారు. 

  • ఇంత మంది పెద్ద స్టార్లు ఉన్న ఫ్యామిలీ నుంచి పరిచయం కావడం బర్డెన్‌ అనుకోలేదా? 

ఫ్రాంక్‌గా చెప్పాలంటే మొదట్లో బర్డెన్‌ అని అనుకోలేదు… అదంతా ఏమీ ఆలోచించలేదు. కొన్ని రోజుల తర్వాత రియలైజ్‌ అయ్యాను. మనం ఇంత చేస్తే సరిపోదు… ఇంకా బాగా పర్‌ఫార్మ్‌ చెయ్యాలి, బాగా డాన్స్‌ చెయ్యాలి అనుకుని నన్ను మోటివేట్‌ చేసుకుని ఇంకా ఎక్కువ కష్టపడ్డాను. 

  • ‘రేయ్‌’ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? మిమ్మల్ని వైవిఎస్‌ చౌదరికి ఎవరైనా రికమండ్‌ చేసారా?

ఒకసారి క్రికెట్‌ ఆడిన తర్వాత 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ ఆఫీస్‌లో విష్ణు అన్నతో ఉన్నాను. అక్కడ వైవిఎస్‌ చౌదరి గారు నన్ను చూసి ‘నువ్వు హీరో అవుతావు’ అన్నారు. ఆయన నా పేరు అడగలేదు, ఎవరు అని కనుక్కోలేదు… డైరెక్ట్‌గా అదే మాట అన్నారు. ‘మా ఫ్యామిలీ మెంబర్స్‌ ఆల్రెడీ చూస్తున్నారు సర్‌’ అన్నాను. ‘మీ ఫ్యామిలీనా.. ఎవరు?’ అని అడిగితే.. ‘నేను చిరంజీవిగారి మేనల్లుడిని’ అని చెప్పాను. ఆయన అప్పుడు చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత కళ్యాణ్‌ గారిని కలిసి మాట్లాడారు. అప్పుడు రేయ్‌ ప్రాజెక్ట్‌ సెట్‌ అయింది. 

  • మీ మొదటి సినిమానే ఇబ్బందుల్లో ఇరుక్కుని విడుదల కాకుండా ఆగిపోయి ఉండడం మీకెలా అనిపిస్తుంది?

ఇదొక లెర్నింగ్‌ ప్రాసెస్‌ అండీ. ఆ సినిమాకి ఎంత టైమ్‌ పట్టింది, ఎందుకు ఆగిపోయింది అనేది నేను ఆలోచించలేదు. ఇలాంటి ఒక సమస్య ప్రతి హీరోకీ వాళ్ల కెరీర్‌లో ఎప్పుడో ఒకసారి వస్తుంది. నాకు ఇనీషియల్‌గానే వచ్చేసింది కాబట్టి నేను హ్యాపీ. ఎందుకంటే ఆ స్ట్రగుల్‌ తెలియాలండీ. ఆ స్ట్రగుల్‌ తెలిస్తేనే ఒక మనిషి అవగాహన పెరుగుతుంది, మెచ్యూరిటీ పెరుగుతుంది. ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్‌. దీని వల్ల నేను బ్యాక్‌లాగ్‌ అంటూ నేనేమీ ఫీలవడం లేదు. 

Watch Sai Dharam Tej Exclusive Interview

  • ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ప్రాజెక్ట్‌ ఎలా సెట్‌ అయింది?

‘రేయ్‌’ షూటింగ్‌ చేస్తుండగా… దిల్‌ రాజుగారి దగ్గర్నుంచి కాల్‌ వచ్చింది. ‘తేజూ.. నీతో ఇలా నేనొక ప్రాజెక్ట్‌ అనుకుంటున్నాను. చేస్తావా?’ అని అడిగారు. ‘తప్పకుండా చేస్తా సర్‌’ అని చెప్పాను. అడివి సాయికిరణ్‌గారి డైరెక్షన్‌లో ‘కేరింత’ సినిమా కోసం ఆడిషన్‌ చేసాను. అది చూసిన తర్వాత… దిల్‌ రాజు గారు ‘ఈ సినిమా తేజు కెరియర్‌కి హెల్ప్‌ అవుతుందా. ఈ సినిమాకి ఇతను సూట్‌ అవుతాడా?’ అని ఆయనకే ఒక ఆలోచన వచ్చి… ఆ ఆడిషన్‌ టేప్‌ రవికుమార్‌ చౌదరిగారికి, అల్లు అరవింద్‌గారికి, బన్నీ వాస్‌గారికి చూపించారు. ‘ఇతను మనం అనుకుంటున్న సినిమాకి సరిపోతాడేమో చూడండి’ అని ఆయన అన్నప్పుడు వాళ్లందరూ సెకండ్‌ థాట్‌ లేకుండా ‘తేజూ మన సినిమాకి కరెక్ట్‌’ అని డిసైడ్‌ అయి ఈ ఆపర్చునిటీ నాకిచ్చారండీ. ఆ నలుగురికీ మనస్ఫూర్తిగా థాంక్స్‌ చెబుతున్నాను. 

  • కేరింత చేద్దామంటే ఓకే అన్నారు.. అది కాదు ‘పిల్లా నువ్వు లేని జీవితం’ కరెక్ట్‌ అంటే దానికీ సరే అన్నారు. అంతే కానీ.. ఈ సినిమా మీకు కరెక్టో కాదో అని మీరు ఆలోచించుకోలేదా? 

సర్‌… మాలాంటి యాక్టర్స్‌కి సినిమాలు రావడమే ఎక్కువండీ (నవ్వుతూ). నా వరకు ఏ ఆపర్చునిటీ వచ్చినా కానీ చేయడానికి సిద్ధంగా ఉంటాను. అఫ్‌కోర్స్‌.. కథ నచ్చాలి.   

  • మాలాంటి యాక్టర్స్‌ అంటారేంటి… మీరేదో అవకాశం కోసం చూస్తున్న అవుట్‌సైడర్‌ కాదు కదా. చిరంజీవి ఫ్యామిలీనుంచి వచ్చారు. మీకంటూ డిమాండ్స్‌ ఉంటాయిగా? 

లేదండీ… అలాంటివేమీ లేవు. చిరంజీవిగారి ఫ్యామిలీ నుంచి వచ్చా కాబట్టి డిమాండ్స్‌ ఉంటాయని అనుకోవద్దు. చెప్పాను కదా… నాకు కథ నచ్చితే, ఇక దేని గురించీ ఆలోచించను. 

Watch Sai Dharam Tej Exclusive Interview

  • ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాలో శ్రీహరి, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్‌ వంటి సీనియర్స్‌తో చేసారు. ఏమైనా టెన్షన్‌ పడ్డారా?

కొత్తగా కాలేజ్‌కి వెళుతున్న స్టూడెంట్‌కి చిన్న భయం ఉంటుంది. సీనియర్లుంటారు.. ర్యాగ్‌ చేస్తారేమో అని. అలాగే నాక్కూడా ఇంతమంది సీనియర్లతో యాక్ట్‌ చేయాలంటే మొదట టెన్షన్‌గానే ఉంది. కానీ వాళ్లంతా ఇచ్చిన సపోర్ట్‌ మార్వలెస్‌ అండీ. నేను కొత్త కనుక కొంచెం టేక్స్‌ ఎక్కువ తీసుకున్నా కానీ వాళ్లంతా ఓపిగ్గా ఉంటూ చాలా సపోర్ట్‌ చేసారు. 

  • ‘పిల్లా నువ్వు లేని జీవితం’లో ఎక్సయిటింగ్‌ ఎలిమెంట్స్‌ ఏంటని మీరనుకుంటున్నారు?

హైలైట్‌ వచ్చి.. డైరెక్టర్‌గారు చేసిన స్క్రీన్‌ప్లే. హై పాయింట్స్‌ వచ్చి ఇంటర్వెల్‌, ప్రీ క్లయిమాక్స్‌. జగపతిబాబుగారికీ, నాకు మధ్య ఉండే సీన్స్‌ చాలా బాగుంటాయి. అనూప్‌ సాంగ్స్‌ అదిరిపోయాయ్‌. రెజీనా గ్లామర్‌ మరొక హైలైట్‌. 

  • అల్లు అర్జున్‌ సెకండ్‌ ఫిలిం ప్రొడ్యూస్‌ చేసిన దిల్‌ రాజు, చరణ్‌ సెకండ్‌ ఫిలిం ప్రొడ్యూస్‌ చేసిన అల్లు అరవింద్‌ కలిసి మీ సెకండ్‌ ఫిలిం ప్రొడ్యూస్‌ చేసారు. సెంటిమెంట్‌గా కలిసి వస్తుందని అనుకుంటున్నారా?

సెంటిమెంట్‌గా కంటే ఇంత పెద్ద ప్రొడ్యూసర్స్‌తో నా కెరీర్లో స్టార్టింగ్‌ స్టేజ్‌లో ఉండగానే చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్లిద్దరు ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్‌ ఎప్పటికీ మర్చిపోలేను. 

  • ‘రేయ్‌’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’.. ఈ రెండిట్లో ఏది ముందుగా రిలీజ్‌ అయితే బాగుంటుందని మీరనుకున్నారు?

ఫ్రాంక్‌గా చెప్పాలంటే… రెండిట్లో ఏది ముందు వచ్చినా నాకు హ్యాపీనే. ఎందుకంటే రెండిటి కోసం నేను ఒకే విధంగా కష్టపడ్డాను. రెండు సినిమాల్ని చాలా ఇష్టపడి, ప్రేమించి చేసాను. సో.. ఇది ముందు రావాలి, అది తర్వాత రావాలి అని నాకు లేదు. రెండు సినిమాల గురించి ఈక్వల్‌గా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. 

Watch Sai Dharam Tej Exclusive Interview

  • ఇన్నేళ్లు వేచి చూసిన తర్వాత ఫైనల్‌గా మిమ్మల్ని మీరు… ప్రేక్షకుల మధ్య తెరపై చూసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో మీ ఫీలింగ్స్‌ ఎలా ఉన్నాయి?

నిజానికి ఇంకా ఆ ఫీలింగ్‌ ఇంకా నాకు సింక్‌ అవలేదండీ. సినిమా రిలీజ్‌ అవుతుందన్న థాట్‌ ఇంకా ప్రాసెస్‌ అవలేదు. బహుశా ఆ రోజు కూడా నేను పడుకుని ఉంటానేమో.. మా ఫ్రెండ్స్‌ వచ్చి ‘ఒరేయ్‌ నీ సినిమా రిలీజయింది..’ అంటే కూడా నమ్మనేమో (నవ్వుతూ). 

  • మీ రెండు సినిమాలు రిలీజ్‌ కాకుండానే హరీష్‌ శంకర్‌లాంటి స్టార్‌ డైరెక్టర్‌తో ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది?

హరీష్‌ అన్న నాతో సినిమా చేస్తానని అనగానే నేను నమ్మలేదు. ఒక కలలా అనిపించింది. ఆయన ఇంతవరకు నా సినిమా ఏమీ చూడలేదు. ట్రెయిలర్స్‌ అవీ చూసి నాతో చేద్దామని అనుకున్నట్టున్నారు. అంత పెద్ద డైరెక్టర్‌తో చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ఐ యామ్‌ రియల్లీ థాంక్‌ఫుల్‌ టు హిమ్‌. 

  • మీతో సినిమా చేయాలంటే ఎవరిని కాంటాక్ట్‌ చేయాలి. మిమ్మల్ని డైరెక్ట్‌గా కలవచ్చా.. లేక మీ ఫ్యామిలీలో ఎవరినైనా సంప్రదించాలా?

అలాంటి ప్రాసెస్‌ ఏమీ లేదండీ. డైరెక్ట్‌గా నన్ను అప్రోచ్‌ అవ్వొచ్చు. నాకు కథ చెప్పవచ్చు. నచ్చితే సినిమా చేస్తాను. సింపుల్‌ ప్రాసెస్‌. 

  • ఏ జోనర్‌ సినిమాలు చేద్దామని అనుకుంటున్నారు?

అదీ ఇదీ అని ఏమీ లేదు. ఏదైనా కానీ చేయడానికి రెడీ. కథ నచ్చితే థ్రిల్లర్‌ మూవీ అయినా, క్రైమ్‌ కామెడీ అయినా, ఆఫ్‌ బీట్‌ సినిమా అయినా చేయడానికి నాకెలాంటి అభ్యంతరాలు లేవు… హారర్‌ ఫిలింస్‌ తప్ప ఏదైనా చేస్తాను. 

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

Watch Sai Dharam Tej Exclusive Interview