వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విచారణను ఎదుర్కొంటున్న కన్నడ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, ప్రస్తుతం జైలు గోడల మధ్య నలిగిపోతున్నాడు. కేసు పూర్తిస్థాయిలో మెడకు చుట్టుకుందని తెలిసిన తర్వాత అతడు మరింత నీరసించిపోయాడు.
ఈ కేసు విచారణ కూడా చాన్నాళ్లు నడిచేలా ఉంది. ఇప్పటికే వందల పేజీల ఎఫ్ఐఆర్ తయారుచేసిన పోలీసులు, ఎప్పటికప్పుడు కేసులో కొత్త సాక్ష్యాల్ని జోడిస్తూనే ఉన్నారు. దీంతో దర్శన్ చేయాల్సిన సినిమాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.
గమ్మత్తైన విషయం ఏంటంటే.. దర్శన్ చేయాల్సిన ఓ సినిమా ఆగిపోగా.. అతడు గతంలో నటించిన ఓ సినిమా రీ-రిలీజ్ అయి సూపర్ హిట్టయింది.
సరిగ్గా రేణుకాస్వామి హత్యకు సరిగ్గా నెల ముందు డెవిల్ సినిమా స్టార్ట్ చేశాడు దర్శన్. ఆ వెంటనే అరెస్ట్ అయ్యాడు. దీంతో ఆ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. ఇక దర్శన్ మేటర్ శాండిల్ వుడ్ లో బాగా నలుగుతున్న సందర్భంలో శాస్త్రి అనే అతడి పాత సినిమా విడుదలైంది. అది కాస్తా సూపర్ హిట్టయింది.
విగ్గు తీసేసిన హీరో…
2005లో విడుదలైన శాస్త్రి సినిమా నుంచే దర్శన్ విగ్గు మెయింటైన్ చేస్తున్నాడు. ఆ విషయం చాలామందికి తెలియదు. అతడిది ఒరిజినల్ హెయిర్ స్టయిల్ అనుకునేవారు. అలా దాదాపు ఆరేళ్ల పాటు దర్శన్ తన విగ్గును అద్భుతంగా మెయింటైన్ చేశారు. ఆ తర్వాత అతడిది విగ్గు అనే విషయం చాలామందికి తెలిసిపోయింది.
సినిమాలతో పాటు, బయట కూడా దర్శన్ విగ్గులోనే కనిపిస్తారు. అయితే ఇప్పుడాయన జైళ్లో ఉన్నాడు. జైళ్లోకి వెళ్లి ఇప్పటికే నెల దాటింది. విగ్గును మెయింటైన్ చేయడం కష్టంగా మారింది. దీంతో దర్శన్ దాన్ని తొలగించాడట. గుండు కొట్టించుకున్నాడని అంటున్నారు.
గురువారంతో దర్శన్ జ్యూడీషియల్ కస్టడీ పూర్తవుతుంది. దీంతో అతడి తరఫు లాయర్లు ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటు పోలీసులు మరిన్ని కొత్త సాక్ష్యాలతో కొత్త పిటిషన్ వేశారు. ఈసారి పోలీస్ కస్టడీ కోరుతున్నారు.