అల్లుశిరీష్ కు కూడా మార్కెట్ పెరిగిందోచ్!

మెగా హీరోల్లో మార్కెట్ పరంగా ఆఖరి స్థానంలో ఉన్న హీరో ఎవరంటే అది అల్లుశిరీష్ మాత్రమే. ఈ విషయంలో మరో చర్చకు తావులేదు. చిరంజీవి చిన్నల్లుడు అసలు రేసులో లేడనే విషయాన్ని ఇక్కడ గుర్తించాలి.…

మెగా హీరోల్లో మార్కెట్ పరంగా ఆఖరి స్థానంలో ఉన్న హీరో ఎవరంటే అది అల్లుశిరీష్ మాత్రమే. ఈ విషయంలో మరో చర్చకు తావులేదు. చిరంజీవి చిన్నల్లుడు అసలు రేసులో లేడనే విషయాన్ని ఇక్కడ గుర్తించాలి. సాయితేజ్ కు ఫ్లాపులొచ్చినా అతడికి కాస్తోకూస్తో మార్కెట్ ఉంది. అలా ఆఖరి స్థానంతో నెట్టుకొస్తున్న అల్లుశిరీష్ కు కూడా మార్కెట్ పెరిగినట్టు కనిపిస్తోంది. ఏబీసీడీ సినిమా దీనికి ఎగ్జాంపుల్ గా మారింది.

అవును.. శాటిలైట్ రైట్స్ విషయంలో మార్కెట్ పెంచుకున్నాడు శిరీష్. ఇతడి సినిమా ఏకంగా 5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. శాటిలైట్, డిజిటల్ హక్కులు కలుపుకొని జీ తెలుగు ఛానెల్ ఈ సినిమాను 5 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఓవైపు మహేష్ బాబు మహర్షి సినిమా 19 కోట్ల రూపాయలకు అమ్ముడుపోతే, ఏబీసీడీకి 5 కోట్లు ఏంటి అని విసుక్కోవద్దు. శిరీష్ మార్కెట్ కు ఇదే ఎక్కువ.

ఇంకా చెప్పాలంటే, తన కెరీర్ లోనే శిరీష్ చూసిన హయ్యస్ట్ మార్క్ ఇది. గతంలో ఇతడు నటించిన హిట్ సినిమా శ్రీరస్తు-శుభమస్తు కూడా ఇంత మొత్తానికి అమ్ముడుపోలేదంటే పరిస్థితిని ఈజీగానే అర్థంచేసుకోవచ్చు. మొత్తమ్మీద ఏపీసీడీ సినిమా శాటిలైట్, డిజిటల్ డీల్స్ పూర్తిచేశారు. థియేట్రికల్ బిజినెస్ కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అయింది.

సురేష్ బాబు రంగంలోకి దిగడంతో కాస్త చెప్పుకోదగ్గ మొత్తాలకే డీల్స్ ఫైనల్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకు ఎన్ని థియేటర్లు దొరుకుతాయనేది పెద్ద సమస్య. ఎందుకంటే, మహర్షి విడుదలైన మరుసటి వారమే ఇది థియేటర్లలోకి వస్తోంది. మే 17 రిలీజ్. 

వైయస్‌ను నెత్తిన పెట్టుకునేలా చేసిన పథకాలను బాబు కాలరాసారు