తెలుగు సినిమాకి సంబంధించి రైటర్స్ అంటే ప్రధానంగా మాటల రచయితలో, స్క్రీన్ప్లే రచయితలో ఉంటారు. అచ్చంగా కథ మాత్రమే ఇచ్చే రచయితలు చాలా అరుదు. వక్కంతం వంశీ ఒక్కడే కథా రచయితగా స్టార్ స్టేటస్ దక్కించుకున్నాడు. డైరెక్టర్ సురేందర్ ఇతడినే తన ఆస్థాన రచయితని చేసేసుకున్నాడు. ఎప్పుడూ వేరే వారి కథలతో సినిమా తీసి ఎరుగని పూరి కూడా టెంపర్కి ఇతని కథనే తీసుకున్నాడు.
డైరెక్టర్ కావాలని వంశీ ఎప్పట్నుంచో కలలు కంటున్నాడు. ఎన్టీఆర్ హీరోగా మొదటి సినిమా ఖరారైంది కూడా. కానీ వక్కంతం వంశీని డైరెక్టర్ అవ్వనివ్వకుండా స్టార్ డైరెక్టర్లంతా ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. ‘అదుర్స్ 2’కి కథ ఇమ్మని వినాయక్ అతడి వెంట పడుతున్నాడు. ఇప్పుడు ‘టెంపర్ 2-కి కథ రెడీ చేయమని బండ్ల గణేష్ అతడికి భారీ ఆఫర్లిస్తున్నాడు.
‘టెంపర్’తో రచయితగా తన డిమాండ్ మరింత పెరగడంతో వక్కంతం వంశీకి ఆఫర్లు ఇంకా పెరుగుతున్నాయి. ఈ ఒత్తిడిలో అతను రచన పక్కనపెట్టి దర్శకుడు కావడమంటే కష్టమే మరి.