రేయ్ సినిమా చేస్తున్నవింతలు ఇన్నీ అన్నీకావు. ఇప్సడు ఆఖరికి దర్శకుడు తివిక్రమ్ కు ఇష్టం లేకపోయినా, సన్నాఫ్ సత్యమూర్తి విడుదల తేదీని మార్పించింది. దీని వైనం..వ్యవహారం ఇలావుంది.
కాక కాక, విడదుల అవుతోంది రేయ్ సినిమా. దానికి అయిన మార్కెట్ అంతంత మాత్రం. ఓవర్ ఫ్లోస్ వస్తేనే గట్టెక్కేది. అందుకే స్వయంగా బన్నీని కలిసి చౌదరి రిక్వెస్ట్ చేసాడు. ఎలాగైనా సత్యమూర్తి విడుదల ఓ వారం వాయిదా వేయమని. కానీ ఇక్కడ చిన్న చిక్కు వచ్చింది. డైరక్టర్ త్రివిక్రమ్ స్వయంగా దగ్గర వుండి విడుదల ముహుర్తం పెట్టించాడు. దాన్నిమార్చడానికి ససేమిరా అన్నాడట. కానీ బన్నీ మాత్రం తప్పక ఒకె అన్నాడు.
ఇక్కడ బన్నీ సమస్య ఏమిటంటే, అసలే సత్యమూర్తి అడియో ఫంక్షన్ లో దర్శకుడు దాసరి చేసిన డామేజ్ ఇంతా అంతా కాలేదు. సజావుగా బ్లాక్ బస్టర్ కావాల్సిన సినిమాపై చిరు అభిమానులపై అలిగేలా చేసారు పెద్దాయిన. ఇప్పుడు రేయ్ కు గ్యాప్ ఇవ్వలేదని తెలిస్తే, మెగా కుటుంబంలో సయోధ్యలేదంటారు. ఇవన్నీ లేనిపోని తలకాయనొప్పులు. అందుకే బన్నీ స్వయంగా త్రివిక్రమ్ ను ఒప్పించాడు. ఇప్పుడు ఇంకా త్రివిక్రమ్ ఊ…ఆ..అంటున్నాడు. నేడొ, రేపో ప్రకటన రాక తప్పదు..వారం వాయిదా పడుతుంది.