‘మా’ స్థాయి రాజేంద్రుడికి లేదా?

సినిమా జనాలు భలే చిత్రమైన వాళ్లు. ఆన్ ది రికార్డుగా ఏమీ మాట్లాడరు కానీ, ఆఫ్ ది రికార్డుగా వాళ్లలో వాళ్లు ఏమైనా మాట్లాడుకుంటారు. ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న గుసగుసల్లో మురళీమోహన్ అన్నారంటున్న…

సినిమా జనాలు భలే చిత్రమైన వాళ్లు. ఆన్ ది రికార్డుగా ఏమీ మాట్లాడరు కానీ, ఆఫ్ ది రికార్డుగా వాళ్లలో వాళ్లు ఏమైనా మాట్లాడుకుంటారు. ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న గుసగుసల్లో మురళీమోహన్ అన్నారంటున్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. రాజేంద్ర ప్రసాద్ ‘ మా’ అధ్యక్షపదవి కి తాను పోటీ చేస్తున్నానని మీడియా సమావేశం పెట్టి వెల్లడించిన తరువాత మురళీ మోహన్ కొందరి దగ్గర చిత్రమైన కామెంట్ చేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

‘ ఆయనకు అప్పుడే ఆ స్థాయి (మా అధ్యక్ష పదవి చేపట్టే) వచ్చిందా’ అని మురళీ మోహన్ కొందరితో అన్నట్లు, అది ఆ నోటా ఈ నోటా పడి రాజేంద్రుడి వరకు చేరినట్లు తెలిసింది. అందుకే రాజేంద్ర ప్రసాద్ తరువాత కొందరికి ఇంటర్వూ ఇచ్చినపుడు ఈ స్థాయి..అనే పదాన్ని నొక్కి నొక్క మరీ చెప్పారట. అంతే కాదు ఆఫ్ ది రికార్డుగా మురళీమొహన్ మాటలు కూడా చెప్పి, బాధపడినట్లు తెలుస్తోంది.

నిజంగా మురళీ మోహన్ ఈ మాట అని వుంటే అది ముమ్మాటికి కరెక్ట్ కాదు. ఎందుకంటే  హీరోగా మురళీ మోహన్ కన్నా రాజేంద్రుడే ఎక్కవ సినిమాలు చేసారు. ఇప్పటికీ మురళీ మోహన్ కన్నా ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. ఆయన కూడా సినిమాలు నిర్మించారు. ఎటొచ్చీ రాజకీయాలు చేయకపోవచ్చు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేయకపోవచ్చు. 

అంత మాత్రం చేత రాజేంద్రుడికి మా అధ్యక్ష పదవి చేపట్టే స్థాయి లేదనడం సరికాదేమో? నిజానికి ఆయన సీనియార్టీని గౌరవించి, ఏకగ్రీవంగా వదిలేసి వుండాల్సింది. కానీ మురళీ మోహన్ పంతానికి వెళ్లి, జయసుధను నిల్చోపెట్టడం ఎంతవరకు సబబు అన్న డిస్కషన్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. అసలు ఈ సారి కూడా మురళీ మోహన్ పోటీ చేస్తానన్నారట. కానీ కొందరు పెద్దలు వారించారట. అన్ని పదవులు ఒక్కరికేనా అన్న మాట వస్తుంది అని. దాంతో జయసుధను తెరమీదకు తెచ్చారట.