సినిమా రంగం హవాలాకు మార్గంగా మారుతోందా?

ఇరు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచైనా హైదరాబాద్ కు భారీగా డబ్బు ఎవరికంటా పడకుండా తరలించాలి అనుకోండి? ఎలా? లేదూ హైదరాబాద్ నుంచి ఎక్కడికైనా తరలించాలి అంటే ఎలా? ఇన్ కమ్ టాక్స్, పోలీసులు ఇతరత్రా…

ఇరు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచైనా హైదరాబాద్ కు భారీగా డబ్బు ఎవరికంటా పడకుండా తరలించాలి అనుకోండి? ఎలా? లేదూ హైదరాబాద్ నుంచి ఎక్కడికైనా తరలించాలి అంటే ఎలా? ఇన్ కమ్ టాక్స్, పోలీసులు ఇతరత్రా జనాల కళ్లు కప్పి కోట్లకు కోట్లు ఎలా తీసుకెళ్తారు? ప్రతి సినిమా విడుదల ముందు రోజు కోట్లకుకోట్ల డబ్బు చేతులు మారుతుంది.  కనీసం పది నుంచి ముఫై నలభై కోట్లు. ఇది చాలా మంది బడా వ్యాపారులు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అనుకూలంగా వుందట.  పైగా వ్యాపారాలు, రాజకీయాలు, సినిమాలు అన్నీ చెట్టాపట్టాలు వేసుకుని వున్నాయి కదా?

ఎలా అంటే…:సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయి అన్నది అందరికీ తెలిసిందే..వెంటనే ఆ సినిమా ఎవరిది..ఏ ఏరియా ఎవరు కొన్నారు అన్న విషయాలు ఆరా తీయడం ప్రారంభమవుతుంది. తమకు హైదరాబాద్ నుంచి ఏ ఏరియాకు డబ్బు వెళ్లాలో, ఆ ఏరియా బయ్యర్ ఎవరో కనుక్కొంటారు. పేమెంట్ ఏ రేంజ్ అన్నది తెలుసుకుంటారు. ఇదంతా ఆ ఫీల్డ్ లో వున్నవారు అందరికీ చాలా సులువైన పని. పై వాళ్లకు అంటే కష్టం.

వెంటనే కాంట్రాక్టు చేసి, హైదరాబాద్ లో అమౌంట్ మేం అరేంజ్ చేస్తా, ఆ ఏరియాలో మీరు మాకు ఇవ్వండి అంటూ ప్రపోజల్ ముందుకు వెళ్తుంది. ఇది ఉభయులకు లాభదాయకమైన సంగతే. ఇబ్బంది లేకుండా మనీ అటు ఇటు తిరిగిపోతుంది. ఏణర్ణం కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫండ్ ఇక్కడి నుంచి అక్కడికి చేర్చడానికి ఈ విధమైన మార్గం బాగా వర్కవుట్ అయిందని కూడా గుసగుసలు వున్నాయి.

మొత్తానికి సినిమా ప్రేక్షకుల వినోదం కోసమే కాదు, అన్ని విధాలా ఉపయోగపడుతోందన్నమాట.