డ్యాన్స్ డైరక్టర్లు హీరోలు కావడం మనం చాలా చూశాం. అయితే సంగీత దర్శకులు మహా అయితే క్యారెక్టర్ యాక్టర్లు, కమెడియాన్లు కావడం మనకు తెలుసు గానీ.. హీరోలు కావడం మన ఎరికలో లేదు. మన తెలుగు ఇండస్ట్రీలో విస్తృతమైన సినిమా పెద్దల పరిచయాలు, సుదీర్ఘమైన అనుభవం అన్నీ ఉన్నప్పటికీ కూడా సినిమా హీరోగా ఎంట్రీ ఇవ్వాలనే కోరిక తీరకుండా అలమటిస్తున్న వ్యక్తుల్లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఒకడు. తన మ్యూజిక్ మ్యాజిక్‌తో అగ్ర హీరోల చిత్రాలకు పెద్ద ఎడ్వాటేజీగా నిలిచే దేవిశ్రీ ప్రసాద్ తను హీరో కావాలని ఎప్పటినుంచో కలలు కంటున్నాడు. కానీ పాపం దేవీకి కాలం కలిసి రావడం లేదు.
పాపం కుర్రాడు చక్కగాటనే ఉంటాడు. డ్యాన్సులు గట్రా బాగానే చేస్తాడు. (పాపం ఆ విషయం నిరూపించుకోవడానికే తన ప్రతి ఆడియో ఫంక్షన్లోనూ వెర్రి మొర్రి గంతులతో అలరించే ప్రయత్నం తప్పక చేస్తుంటాడు.) ఇన్ని చేస్తున్నా అతగాడికి హీరో చాన్సు మాత్రం రావడం లేదు.
గతంలో ఓ హీరోయిన్‌తో దేవీ ప్రేమ వ్యవహారం పీకల్దాకా ఉన్నప్పుడు.. తన రియల్ లైఫ్ హీరోకు` సినీ హీరో చాన్సు ఇప్పించడానికి సదరు హీరోయిన్ చేయని ప్రయత్నం లేదు. వీరిద్దరూ ఇక పెళ్లి చేసుకోవడం ఒక్కటే మిగిలింది అనే రేంజిలో ప్రచారం జరుగుతుండగా.. ఆమె ఇతని సినిమా చాన్సులకోసం ప్యాకేజీలను కూడా నిర్మాతలకు ప్రకటించింది. అయితే వర్కవుట్ కాలేదు. తర్వాత వారి బంధం కట్ అయింది. ఇప్పుడు ఆ హీరోయినే ఐటం గాళ్ అయిపోయింది.
అయితే ట్రాజెడీ ఏంటంటే.. దేవీశ్రీ అంత క్రేజ్ సంగీత దర్శకుడిగా లేకపోయినా.. తమిళ సంగీతదర్శకుడు కుర్రాడు జివి ప్రకాష్ ఇప్పుడు హీరోగా అవతారం ఎత్తుతున్నాడు. అతని సినిమా పెన్సిల్ త్వరలోసెట్స్ మీదకు వెళ్లనుంది. పాపం దేవీ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంటే వర్కవుట్ కావడం లేదు. ఓనర్స్ ప్రైడ్ .. నెయిబర్స్ ఎన్వీ.. అన్నట్లుగా పొరుగు పరిశ్రమ సంగీతదర్శకుడు హీరో అయిపోతూ ఉంటే.. చూసి అసూయ పడాల్సిన పరిస్థితి ఏర్పడిరది మన దేవిశ్రీప్రసాద్‌కు.