ఇదేం టేస్ట్ తల్లోయ్..?

ఒక మనసు సినిమాలో హీరోయిన్ నీహారిక కట్టిన డ్రెస్ లు, చీరలు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రథమార్థంలో ఓకె. కానీ,ద్వితయార్థం గడుస్తున్న కొద్దీ నీహారిక కట్టిన చీరలు చూస్తుంటే, ఎవరు ఎంచారు బాబూ..ఈ…

ఒక మనసు సినిమాలో హీరోయిన్ నీహారిక కట్టిన డ్రెస్ లు, చీరలు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రథమార్థంలో ఓకె. కానీ,ద్వితయార్థం గడుస్తున్న కొద్దీ నీహారిక కట్టిన చీరలు చూస్తుంటే, ఎవరు ఎంచారు బాబూ..ఈ చీరలు..అమ్మమ్మల కాలం నాటివి అని ఒకటే కామెంట్ లు. తీరా విచారిస్తే, స్వయంగా నీహారిక తల్లే క్యాస్ట్యూమ్స్ ఎంచారట. 

ఈ తరం అమ్మాయిలు కట్టుకున్న పార్టీ వేర్ రకాలు ఎన్నో వున్నాయి. శారీల్లో కూడా అద్భుతమైన చీరలు కనిపిస్తున్నాయి. అలాంటిది మిడిల్ ఏజ్డ్ వాళ్లు కూడా కట్టడానికి ఆలోచించేలా, సంకోచించేలాంటి డిజైన్లు, ప్లెయిన్ చీరలు తీసుకువచ్చి నీహారికకు చుట్టబెట్టారు. 

చిత్రమేమిటంటే, సినిమాకు వచ్చిన అమ్మాయిలు కూడా ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయడం. అదే సమయంలో నాగశౌర్య డ్రెస్ లకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. డ్రెస్ ల సెలక్షన్ బాగుందన్న కామెంట్ లు వినిపించాయి.