Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కమ్మోళ్లపై కమ్మోళ్లు గుస్సా?

కమ్మోళ్లపై కమ్మోళ్లు గుస్సా?

ఎవరు ఎంత అభ్యంతరాలు వ్యక్తంచేసినా, ఆంధ్రలో వ్యవహారాలు కులం చుట్టూనే తిరుగుతాయి. ప్రతిదానికి ఎక్కడో ఒక దగ్గర కులంతో, కాదు అంటే రాజకీయంతో లింక్ వుంటూనే వుంటుంది. ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దానికి పొలిటికల్ టచ్ అంటకూడదని, రెండు భాగాలు చేసేసారు. తొలిభాగాన్ని పూర్తిగా సినిమాలకు అంకింతం చేసారు. ఎక్కడ, ఎట్నుంచి వెళ్లి ఏమి వస్తుందో అని చంద్రబాబును కూడా సినిమా ఫంక్షన్లకు దూరంగా వుంచారు లేదా ఆయనే దూరంగా వున్నారు.

ఇన్నిచేసినా బయోపిక్ మీద ఎంత నెగిటివ్ ప్రచారం జరగాలో అంతా జరిగింది. కాపుల పేరిట వాట్సప్ లో విపరీతంగా పోస్ట్ లు చలామణీ అయ్యాయి. ఈ సినిమాను తిరస్కరించి, కాపుల ఆత్మగౌరవం చాటాలంటూ పోస్టులు వెల్లువెత్తాయి. మరోపక్క సినిమా మీద ట్రోలింగ్ విపరీతంగా జరిగింది.

ఇవన్నీ ఒక ఎత్తు. మరో వ్యవహారం ఇంకోఎత్తు. కమ్మ సామాజిక వర్గ జనాలే ఈ సినిమాను పట్టించుకోవలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను ఓవర్ సీస్ లో 20 కోట్లకు (రెండు భాగాలు కలిపి) కొన్నారు. రెండో కోట్లు రిటర్న్ హామీ వుంది. అయితే ఇలాకొనడం వెనుక ధీమా ఒకటి ఎన్టీఆర్ బయోపిక్ అని, రెండవది అమెరికాలో వున్న కమ్మ సామాజికవర్గ జనాలు అంతా ఈ సినిమాను తప్పని సరిగా ఆదరిస్తారని ధీమాపడడం. 

విడుదల దూరంగా వుండగా ఓవర్ సీస్ కలెక్షన్లపై చాలా అంచనాలు వేసుకున్నారు. విడుదల దగ్గరయ్యాక రెండు మిలియన్లు చేస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుందనుకున్నారు. విడుదలయ్యాక ఒకటిన్నర మిలియన్ లేదా కాస్త ఎక్కువ చేస్తుందని అంచనావేసారు. ఇప్పుడు పరిస్థితి అలా కూడా కనిపించడం లేదు.

దీంతో రెండు విధాలుగా కమ్మ సామాజిక వర్గం రియాక్ట్ అవుతోంది. కమ్మవాళ్లే ఎన్టీఆర్ సినిమాను ఆదరించకపోవడం ఏమిటని, రాజకీయాలు, తిండి, ఫంక్షన్లు ఇలాంటివి అంటే చూపించే ఆసక్తి దీనిపై చూపించకపోవడం ఏమిటని వాళ్లలో వాళ్లే అనుకుంటున్నారు.

అదే సమయంలో కమ్మ సామాజిక వర్గం ఆధీనంలో వున్న మీడియా సంస్థలు కూడా ఈ సినిమాకు బోల్డ్ గా రేటింగ్ లు ఇవ్వలేదని, సామాజిక వర్గం పేరు చెప్పుకుంటారు కానీ, అవసరం అయినపుడు ఉపయోగపడడం ఏమిటని గుసుగుసలాడుకుంటున్నారు. అమెరికాలో కమ్మవారు తలుచుకుంటే సినిమాను నిలబెట్టడం పెద్ద కష్టంకాదని.

ఒకటి రెండు మీడియా సంస్థలకు కమ్మ వారు ఫోన్ చేసి ఈ విషయమై నిలదీసినట్లు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తొలిభాగం అందరూ ఆదరించాల్సింది. అదే ఇలా వుంటే, మలి భాగం పూర్తిగా రాజకీయాలకు అంకితం. దాన్ని ఇంకెలా ఆదరిస్తారో? ఇంకెంత నెగిటివ్ ప్రచారం చేస్తారో? అని టెన్షన్ పడుతున్నారు కూడా.  

తేలని అభ్యర్థుల ఎంపిక.. పవన్ కల్యాణ్ పనే హాయి!

NTR బయోపిక్ గురించి తెలియని విషయాలు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?