Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పాపం..14 రీల్స్.. అనిల్ సుంకర

పాపం..14 రీల్స్.. అనిల్ సుంకర

మన టైమ్ బాగాలేకపోతే తాడు అన్నదే పాము అయిపోతుంది. బంగారాన్ని టచ్ చేస్తే మసిబొగ్గు అయిపోతుంది. అలాంటి టైమ్ కనిపెట్టి సైలంట్ గా చేతులు ముడుచుకు వుండాల్సిందే. అంతకన్నా చేసేది ఏమీలేదు. 14 రీల్స్, ఎకె అనిల్ సుంకర ల టైమ్ అంత బాగున్నట్లు లేదు. నిర్మాణంలో చాలానష్టాలు చవిచూసారు. ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ బయోపిక్ బిజినెస్ లో ఎంటర్ అయ్యారు. 

అనిల్ సుంకర తన వింటేజ్ సంస్థ ద్వారా, ఈస్ట్ గోదావరికి బయోపిక్ ను దాదాపు అయిదున్నర కోట్లకు కొన్నారు. పండగ సీజన్ అన్న ధీమా వుండడం, బయోపిక్ కావడం ఆ ధైర్యానికి కారణం. లేదూ అంటే బాలయ్య సినిమాకు అంత రేటు వుండదు. కానీ ఇప్పుడు ఈ పండుగ నాలుగు రోజలు బాగా వుంటే కనీసం సగానికి పైగా రివవరీ అవుతుంది. లేదూ అంటే చాలా కష్టం.

ఇక 14 రీల్స్ వాళ్లది మరో కథ. ఓవర్ సీస్ హక్కులు వేరే వాళ్లు కొనుక్కుంటే, విడుదలకు రెండు వారాల ముందు కోరి, అడిగి అడిగి మరీ దాదాపు మూడువంతల స్టేక్ ను తీసుకున్నారు. అక్కడ పరిస్థితి అంత బాగా లేదు. కొంతవరకు కిందకు అమ్మేసినా, కొంత లయిబులిటీ అయితే ఇంకావుంది.

అయితే ప్రస్తుతానికి వీళ్లకు వున్న ధీమా రెండోభాగం వుండడం. ఆ భాగం పంపిణీకి ఇస్తామని, రికవరీ అయిపోయాక, చూసుకుందామని తొలి భాగంలోనే కాస్త అస్యూరెన్స్ ఇవ్వడం. మరి దాని వ్యవహారాన్ని క్రిష్ ఏం చేసారో చూడాలి మరి.

తేలని అభ్యర్థుల ఎంపిక.. పవన్ కల్యాణ్ పనే హాయి!

NTR బయోపిక్ గురించి తెలియని విషయాలు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?