వినయ విధేయ రామ టాక్ విధ్వంసం సంగతి అలా వుంచితే, కలెక్షన్లు స్టడీగానే వున్నాయి రెండో రోజు కూడా. ఇదే కొంచెం ఆశాజనకంగా వుంది కొనుక్కున్నవాళ్లకు. తొలిరోజు 26 కోట్ల వరకు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు సాగించిన సినిమా, రెండోరోజు దగ్గర దగ్గర నాలుగు కోట్ల వరకు షేర్ సాధించింది. దీంతో రెండు రోజులకు దగ్గర దగ్గర 29 కోట్లకు పైగా షేర్ వచ్చినట్లు అయింది.
సినిమాను 72 కోట్లకు విక్రయించారు. ఆది, సోమ, మంగళ, బుధ ఈ నాలుగు రోజులు పండుగ హడావుడి వుంటుంది. ఈ నాలుగు రోజులు ఇదే విదంగా కలెక్షన్లు వుంటే యాభై కోట్ల మార్క్ ను టచ్ చేస్తుంది. ఆ తరువాత చూడాలి నష్టాలు ఏ మేరకు, బ్రేక్ ఈవెన్ అయిందా అన్నది.
రెండోరోజు వసూళ్లు
నైజాం……….1.61 కోట్లు
సీడెడ్.……….0.45 లక్షలు
ఉత్తరాంధ్ర…….0.61
ఈస్ట్………….0.32
వెస్ట్…………..0.25
కృష్ణ…………..0.36
గుంటూరు……0.35
నెల్లూరు.……..0.15