టాలీవుడ్ బాక్సాఫీస్ ఎప్పటిలానే నవంబర్‌లో డల్‌గా నడుస్తోంది. వీకెండ్స్‌లో తప్ప కలెక్షన్స్ పెద్దగా రావట్లేదు. ఈమధ్య వచ్చిన సినిమాల్లో కార్తికేయ ఒక్కటే బయ్యర్లకి లాభాలు తెచ్చి పెట్టి హిట్ అనిపించుకుంది. ఓపెనింగ్స్ పరంగా ఫర్వాలేదనిపించుకున్న ‘కరెంట్ తీగ’కి సడన్‌గా పవర్ కోల్పోయింది. మొదటి వారాంతం తర్వాత ఈ చిత్రానికి అస్సలు వసూళ్లు లేవు.
ఈ చిత్రంపై బయ్యర్లకి భారీగానే నష్టాలు వచ్చినట్టు ట్రేడ్ రిపోర్ట్. ఇక గత వారం విడుదలైన ‘జోరు’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ కూడా బాగా డ్రాప్ అయ్యాయి. ఈ చిత్రాలకి ఫస్ట్ వీకెండ్‌లో చెప్పుకోతగ్గ స్పందన వచ్చినా కానీ సోమవారం నుంచి కలెక్షన్స్ గణనీయంగా పడిపోయాయి. ఈ ట్రెండ్‌తో ఈ చిత్రాలు కోలుకోవడం కష్టమేనని తేలిపోయింది.
మొత్తం మీద ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ‘కార్తికేయ’ మినహా మరేదీ ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. అనువాద చిత్రం ‘పూజ’కి మాస్ ఆదరణ బాగానే దక్కింది. ఈవారం రాబోతున్న ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘ఎర్రబస్సు’ చిత్రాలు సినిమా బిజినెస్‌ని స్లంప్‌నుంచి గట్టెక్కిస్తాయో లేదో చూడాలి.