అసలే విదేశం..అందునా అడవి..అలాంటపుడు ఎవరికైనా భయం వుంటుంది. సినిమావాళ్లు అందుకు అతీతం కాదు. అందుకే అఖిల్ హీరోగా నితిన్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ లోకేషన్ షిఫ్ట్ అయింది. ఇంతకీ విషయం ఏమిటంటే..అఖిల్ సినిమాకు సంబందించి కొంత షూట్ అడవి బ్యాక్ డ్రాప్ లో జరగాల్సి వుంది.
అయితే అసలే అంతగా పరిచయం లేని ప్రాంతం, పైగా అడవి, ఎందుకొచ్చిన రిస్క్..అని బ్యాంకాక్ కు కాస్త దగ్గరలో ఏదైనా అడవి వుంటే చూడమని షూటింగ్ లో పాలు పంచుకునే సీనియర్లు, మరి కొందరు నాగ్ కు చెప్పారట. ఆయన సరే అని నితిన్ కు ,వినాయక్ కు చెప్పడం, వారు బ్యాంకాక్ దగ్గరలో ఓ లోకేషన్ ఫిక్స్ చేయడం జరిగిపోయిందట. సో, బ్యాంకాక్ దగ్గరలోని అడవిలోనే షూటింగ్ అన్నమాట.