Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కుక్కని నమ్ముకున్న తమన్నా

కుక్కని నమ్ముకున్న తమన్నా

బాలీవుడ్‌లో ఘనంగా అడుగు పెట్టిన తమన్నాని సాజిద్‌ ఖాన్‌ రెండుసార్లు మోసం చేసాడు. కమర్షియల్‌ దర్శకుడు కదా అని అతని దర్శకత్వంలో తమన్నా వరుసగా రెండు సినిమాలు చేసింది. ఆ సినిమాలు ఫ్లాపవడం కంటే అవి ఎదుర్కొన్న విమర్శలు తమన్నాని బాధ పెట్టాయి. హమ్‌షకల్స్‌ చిత్రానికి కనీసం పబ్లిసిటీలో కూడా పాల్పంచుకోలేదు. 

ఈ నేపథ్యంలో ఆగస్ట్‌లో రిలీజ్‌ కాబోతున్న తన హిందీ చిత్రం ‘ఇట్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’పై తమన్నా చాలా హోప్స్‌ పెట్టుకుంది. అక్షయ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కుక్క ప్రధాన పాత్ర పోషించింది. అక్కీ మార్కు కామెడీ సినిమా అని అనిపిస్తోన్న ఈ చిత్రమైనా హిట్‌ అనిపించుకోకపోతే ఇక తమన్నా బాలీవుడ్‌పై ఆశలు వదిలేసుకోవచ్చు. 

ఒక్క హిట్‌ పడితే బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లకి దిమ్మ తిరిగే రేంజ్‌లో అక్కడ ఎదిగిపోవాలని చూస్తోన్న తమన్నా ఆశల్ని అక్కీతో పాటు ఆ కుక్క ఎంతవరకు నిలబెడుతుందో ఏమో.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?