డోలాయమానంలో లైలా సెన్సార్

ఒక వేళ సెన్సారు వాళ్లు ఎ సర్టిఫికెట్ ఇస్తే ఏం చేయాలి. సినిమాలో కమర్షియల్ గా వర్కవుట్ అవుతాయి అనుకున్న సీన్లు, డైలాగులు కోసేసి యు/ఎ ఇస్తే ఏం లాభం?

ఒకప్పుడు ఎ సర్టిఫికెట్ అంటే భయం, అమ్మో ఫ్యామిలీ ప్రేక్షకులు రారేమో అని. కానీ ఇప్పుడు ఎ సర్టిఫికెట్ అంటే అదనపు క్వాలిఫికేషన్. ఆనిమల్ సినిమాను విరగబడి చూసారు. బేబీ సినిమాను సక్సెస్ చేసారు. ఇలా చెప్పుకుంటూ పొతే ఇంకా చాలా ఉదాహరణలు వున్నాయి. కానీ ఇంకా టాలీవుడ్ హీరోలకు ఎందుకో ఎ సర్టిఫికెట్ అంటే భయం. తమను ఫ్యామిలీలు ఎక్కడ దూరం చేసుకుంటాయో అని అనుమానం.

విష్వక్ సేన్ లేటెస్ట్ సినిమా లైలా. సాహు గారపాటి నిర్మాత. ఈ సినిమా సెన్సారు ముంగిటకు వచ్చింది. సెన్సారు కావాల్సి వుంది. అయితే సినిమా కంటెంట్ రీత్యా ఎ వస్తుందా, యు/ఎ వస్తుందా అన్నది అనుమానం. అది సెన్సారు అయితే తప్ప తెలియదు. ఒక వేళ సెన్సారు వాళ్లు ఎ సర్టిఫికెట్ ఇస్తే ఏం చేయాలి. సినిమాలో కమర్షియల్ గా వర్కవుట్ అవుతాయి అనుకున్న సీన్లు, డైలాగులు కోసేసి యు/ఎ ఇస్తే ఏం లాభం? అదే కనుక కట్ లేకుండా ఏ సర్టిఫికెట్ ఇచ్చినా సమస్య లేదు.

కానీ ఇవన్నీ ఎప్పుడు అంటే అసలు సినిమా చూసి సెన్సారు జనాలు ఏమంటారు అన్న దాని తరువాత. ఇప్పుడు లైలా యూనిట్ అదే టెన్షన్ లో వుంది. లైలా సినిమాలో విష్వక్ సేన్ సగం లెంగ్త్ లేడీ గెటప్ లో కనిపిస్తాడు. ఆ లేడీ గెటప్ లో వుండే హ్యూమర్ కాస్త బోర్డర్ దాటి అడల్ట్ టచ్ తో వుంటుందని తెలుస్తోంది.

2 Replies to “డోలాయమానంలో లైలా సెన్సార్”

Comments are closed.