రజనీకాంత్ స్టయిల్ లో ఎన్టీఆర్

తనను కలవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానుల్ని, తనే స్వయంగా కలుస్తానని ఎన్టీఆర్ ప్రకటించాడు.

అభిమానుల్ని కలిసే విధానంలో రజనీకాంత్ ప్రత్యేకంగా వ్యవహరిస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ను కలవడానికి ఆయన ఇష్టపడరు. కేవలం ఫ్యాన్స్ కోసం ఆయన ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటుచేస్తారు. అప్పుడప్పుడు చెన్నైలో అంగరంగ వైభవంగా ఆ కార్యక్రమం జరుగుతుంటుంది.

ఇప్పుడు ఎన్టీఆర్ కూడా, రజనీకాంత్ స్టయిల్ ను ఫాలో అవుతున్నారు. తనను కలవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానుల్ని, తనే స్వయంగా కలుస్తానని ఎన్టీఆర్ ప్రకటించాడు. కేవలం అభిమానుల కోసం ఓ కార్యక్రమం ఏర్పాటు చేస్తానన్నాడు.

తనపై చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసిన ఎన్టీఆర్.. కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు పోలీస్ డిపార్ట్ మెంట్ తో పాటు, సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తామని, అందుకు సమయం పడుతుందని, కాబట్టి ఫ్యాన్స్ అంతా ఓపిగ్గా ఉండాలని కోరాడు.

ఈ సందర్భంగా మరో ప్రత్యేక విన్నపం కూడా చేశాడు తారక్. తనను కలవడం కోసం పాదయాత్రల్లాంటివి చేయొద్దని, అభిమానుల క్షేమం తన తొలి ప్రాధాన్యమని అన్నాడు. త్వరలోనే ఫ్యాన్స్ మీట్ కు సంబంధించిన వివరాల్ని వెల్లడిస్తారు.

3 Replies to “రజనీకాంత్ స్టయిల్ లో ఎన్టీఆర్”

Comments are closed.