సుకుమార్ బాగా ఖర్చు పెట్టించేస్తున్నాడని, అదే పనిగా సినిమాని చెక్కుతున్నాడని, నిర్మాతల నెత్తిన పెద్ద భారమైపోయిందని, ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవడం కష్టమవుతుందేమో అని కొంతకాలంగా ‘1 నేనొక్కడినే’ గురించి మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. అయితే మహేష్‌బాబులాంటి సూపర్‌స్టార్ సినిమాకి ఎంత ఖర్చయినా కానీ నిర్మాతలు ఎప్పుడూ సేఫ్‌గానే ఉంటారని తేలింది.
‘1’ చిత్రం టోటల్ డిస్ట్రిబ్యూషన్ ప్లస్ శాటిలైట్ తదితర రైట్స్ అన్నీ ఈరోస్ సంస్థ సొంతం చేసుకుంది. 72 కోట్ల రూపాయలకి ఈ డీల్ జరిగిందని సమాచారం. దీంతో ఈ చిత్రం థర్డ్ పార్టీలకి అమ్మడం, వచ్చిన వసూళ్లతో బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో లెక్క చూసుకోవడం లాంటి తలనొప్పులు నిర్మాతలకి ఉండవు. పూర్తిగా లాభ నష్టాలన్నీ ఈరోస్ భరిస్తుంది.
ఈరోస్ ఈ చిత్రాన్ని సొంతం చేసుకోవడం వల్ల వారి కార్పొరేట్ స్టయిల్ ప్రమోషన్ 1కి చాలా ప్లస్ అవుతుంది. ఈ డీల్ కనుక వర్కవుట్ అయినట్టయితే రాబోయే పెద్ద సినిమాలన్నిటికీ ఇలాంటి డీల్స్ కామన్ అయిపోతాయి. ఆ విధంగా 1 ట్రెండ్ సెట్టర్ అవుతుంది. విడుదలకి ముందు 72 కోట్లు తెచ్చుకున్న సినిమాగా ఈ చిత్రం రికార్డ్ కూడా సెట్ చేసింది.