Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మణిరత్నం మల్టీ స్టారర్.. అలా మిస్ అయ్యింది!

మణిరత్నం మల్టీ స్టారర్.. అలా మిస్ అయ్యింది!

ప్రస్తుతం ఒక మల్టీ స్టారర్ సబ్జెక్టును చేతిలో పెట్టుకుని తిరుగుతున్నాడు దిగ్దర్శకుడు మణిరత్నం. ఇటీవలే ‘ఓకే బంగారం’ సినిమాతో హిట్‌ను నమోదు చేసినా.. ఈ దర్శకుడితో సినిమా చేయడానికి స్టార్లు ముందుకు రావడం లేదు. ఈ విషయంలో అనేక మందిని ట్రై చేశాడు, చేస్తున్నాడు మణి. ముందుగా.. మహేశ్ బాబు, నాగార్జునల కాంబోలో ఈ సినిమాను రూపొందించాలని మణి భావించాడు. అందుకోసం చేసిన ప్రయత్నాలు సఫలం అయినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమా గురించి సుహాసిని ప్రకటన కూడా చేశారు. అయితే ఆ ప్రకటన ప్రకటనగానే ఆగిపోయింది. సినిమా పట్టాలెక్కలేదు.

ఆ తర్వాత ఈ సినిమా విషయంలో చాలా మంది హీరోల పేర్లు వినిపించాయి. కార్తీ- దుల్కర్ సల్మాన్ అని, కార్తీ- నాని అని అన్నారు. ఇప్పుడైతే రాణా- నాగ చైతన్య ల కాంబోలో ఈ సినిమా వస్తుందని అంటున్నారు.  అయితే ఖరారు కాలేదు. మరి ఈ సినిమా ఎప్పటికి ఎవరితో పట్టాలెక్కుతుందో తెలియదు. అయినా మణికి ఇలాంటి తిరస్కరణలు కొత్తేమీ కాదు. ఇంతకు ముందు కూడా మణిరత్నం దర్శకత్వంలో తెలుగులో ఒక మల్టీస్టారర్ సినిమాను రూపొందించే ప్రయత్నాలు జరిగాయి. అది దాదాపు 27 ఏళ్ల కిందట! తమిళంలో సంచలన విజయం సాధించిన ‘అగ్నినట్చత్రం’ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అప్పట్లో ప్రయత్నాలు జరిగాయి. 

తీరా ఆ సినిమా డబ్బింగ్ అయ్యే సరికి విషయం అర్థమయ్యిందో ఏమో కానీ.. మణిరత్నంతో సినిమా చేయడానికి నాగార్జున ఉత్సాహం చూపించాడు. అప్పటికే మణిరత్నంతో కో ఆర్డినేషన్ కలిగిన నిర్మాత నరసా రెడ్డి ‘గీతాంజలి’ నిర్మించాడు. ఆ సినిమా క్లాసిక్ స్టేటస్ ఏమిటో వర్ణించనక్కర్లేదు! ఆ విధంగా మల్టీస్టారర్ సినిమా మిస్ అయినా.. మరో క్లాసిక్ తెలుగులో రూపొందింది. దాదాపు 27 యేళ్ల తర్వాత మళ్లీ మణిరత్నం ఒక మల్టీస్టారర్ సబ్జెక్టుతో తిరస్కరణలు ఎదుర్కొంటున్నారు. ఈ తిరస్కరణలు మరోక్లాసిక్‌కు తెర తీసేనా?! 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?