Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగశౌర్య అశ్వద్ధామ

నాగశౌర్య అశ్వద్ధామ

నర్తనశాల సినిమా తరువాత ట్రాక్ తప్పి, ఇబ్బంది పడిన హీరో నాగశౌర్య ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాడు. వరుసగా సినిమాలు సెట్ మీదకు వచ్చేసాయి. సమంతతో ఓ బేబీ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. రాఘవేంద్రరావు ప్లానింగ్ లో ముగ్గురు డైరక్టర్లు, ముగ్గరు హీరోయిన్లతో ఆర్కే సంస్థ నిర్మించే సినిమాలో హీరోగా చేస్తున్నాడు. అలాగే సంతోష్ జాగర్లమూడి డైరక్షన్ లో ఓ సినిమా లైన్ లో వుంది.

స్వంత బ్యానర్ మీద ఓ సినిమా షూటింగ్ చకచకా జరుగుతోంది. ఈ సినిమాకు అశ్వద్ధామ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. నాగశౌర్య తయారుచేసుకున్న కథతో కొత్త దర్శకుడు రూపొందిస్తున్న సినిమా ఇది. మెహరిన్ హీరోయిన్. రమణతేజ దర్శకుడు.

ఇంతవరకు టైటిల్ అధికారికంగా ప్రకటించలేదు కానీ, అశ్వద్దామ అనే టైటిల్ ఫిక్స్ చేసుకుని, రిజిస్టర్ చేసి వుంచినట్లు తెలుస్తోంది. నర్తనశాల తరవాత మళ్లీ మహాభారతం టచ్ లోనే టైటిల్ ఫిక్స్ చేయడం విశేషం.

ఎన్టీయార్‌ పేరుతో గెలిచేశారు.. లంచం తీసుకుంటే పట్టించారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?