నాలుగు కోట్లు వచ్చిందట..

డిసిఆర్ లు, కలెక్షన్లు అన్నీ టాలీవుడ్ లో కాకిలెక్కలే. ఎవరికి తోచింది వారు చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే డిసిఆర్ లు నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు తప్ప వేరే వారికి అందుబాటులో వుండవు. అక్కడాఅక్కడా కొన్ని థియేటర్ల లెక్కలు…

డిసిఆర్ లు, కలెక్షన్లు అన్నీ టాలీవుడ్ లో కాకిలెక్కలే. ఎవరికి తోచింది వారు చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే డిసిఆర్ లు నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు తప్ప వేరే వారికి అందుబాటులో వుండవు. అక్కడాఅక్కడా కొన్ని థియేటర్ల లెక్కలు తెలియచ్చు కానీ, పక్కాగా తెలుసు అని చెప్పడానికి లేదు. తొలి రోజు అయిందో లేదో, నాలుగు కోట్లు కలెక్షన్లు వచ్చాయోచ్ అని ప్రకటించేసారు రఫ్ బృందం. 

సినిమాకు టాక్ తో సంబంధం లేకుండా తొలి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయన్నది వాస్తవం. కానీ మరీ నాలుగు కోట్లు తొలిరోజే వచ్చాయని చెప్పడం చూస్తే, కాస్త ఆశ్చర్యంగా వుంది. నిజానికి సినిమాకు పూర్తిగా నెగిటివ్ టాక్ వచ్చింది. టాక్ తో సంబంధం లేకుండా మొదటి మూడురోజులు కలెక్షన్లు బాగానే వుంటాయి. అందులో సందేహంలేదు. కానీ మరీ మొదటి రోజే నాలుగు కోట్లు అని చెప్పడం అంటే ఏమనుకోవాలి?