ఎన్టీఆర్‌కో ‘పోకిరి’!

మహేష్‌బాబు ‘పోకిరి’ ముందు వరకు ఒక తరహా పాత్రలు మాత్రమే చేసాడు. అండర్‌ ప్లే చేయడం అలవాటైన మహేష్‌కి పూరి జగన్నాథ్‌ ‘పోకిరి’తో న్యూ లుక్‌ ఇచ్చాడు. మహేష్‌ని అంతవరకు ఎవరూ చూపించని విధంగా…

మహేష్‌బాబు ‘పోకిరి’ ముందు వరకు ఒక తరహా పాత్రలు మాత్రమే చేసాడు. అండర్‌ ప్లే చేయడం అలవాటైన మహేష్‌కి పూరి జగన్నాథ్‌ ‘పోకిరి’తో న్యూ లుక్‌ ఇచ్చాడు. మహేష్‌ని అంతవరకు ఎవరూ చూపించని విధంగా చూపించి ఇండస్ట్రీ హిట్‌ కొట్టాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమాలోను పూరి అదే ఫాలో అవుతున్నాడని విశ్వసనీయంగా తెలిసింది. 

ఇంతవరకు ఇరవై మూడు చిత్రాలు చేసిన ఎన్టీఆర్‌ని ఎవరూ చూపించని కొత్త శైలిలో పూరి జగన్నాథ్‌ చూపిస్తున్నాడట. ఈ చిత్రంలో హీరో క్యారెక్టరైజేషన్‌, బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరీ అన్నీ చాలా విభిన్నంగా ఉంటాయని, ఎన్టీఆర్‌ని చూసి అభిమానులు కూడా సర్‌ప్రైజ్‌ అయ్యేలా ఇందులో పూరి ప్రెజెంట్‌ చేస్తున్నాడని టాక్‌ వినిపిస్తోంది. 

గతంలో ఎన్టీఆర్‌తో ‘ఆంధ్రావాలా’ చిత్రాన్ని చేసిన పూరి జగన్నాథ్‌ నిజానికి ఆ కథని అతడిని దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేయలేదు. చిరంజీవితో చేద్దామని అనుకున్న కథకి ఎన్టీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. అది మిస్‌ ఫైర్‌ అయింది. ఎన్టీఆర్‌కి హిట్‌ ఇవ్వలేదనే లోటు పూరి జగన్నాథ్‌ని ఇంకా వెంటాడుతోంది. ఈసారి ఆంధ్రావాలా లోటుని కూడా భర్తీ చేసి… ఎన్టీఆర్‌ కెరీర్‌లో నిలిచిపోయే చిత్రాన్ని పూరి తెరకెక్కిస్తున్నాడని బజ్‌ ఉంది.