పవన్‌కళ్యాణ్‌తో ‘గబ్బర్‌సింగ్’ సీక్వెల్ చేజారడంతో డైరెక్టర్ సంపత్ నంది వేరే సినిమా చేసుకునే పనిలో పడ్డాడు. రవితేజతో తన తదుపరి చిత్రం ఉంటుందని సంపత్ నంది ప్రకటించాడు. తాజాగా తమన్నా కూడా మళ్లీ ‘రచ్చ’ దర్శకుడితో చేస్తున్నానంటూ రవితేజ చిత్రంలో తానే హీరోయిన్‌నని ప్రకటించింది. హీరో హీరోయిన్ ఇద్దరూ రెడీ అయిన ఈ చిత్రానికి నిర్మాత ఎవరనేది మాత్రం ఇంకా తేలలేదు.
హీరో`హీరోయిన్`డైరెక్టర్ కాంబినేషన్ రెడీ కాగా… ఇప్పుడు వీరిపై ఇన్వెస్ట్ చేసే నిర్మాత కోసం చూస్తున్నారు. ఇటు సంపత్ నంది తనకి తెలిసిన నిర్మాతలని రవితేజ పేరు చెప్పి ఊరిస్తుండగా… అటు రవితేజ కూడా సంపత్ దగ్గర కథ ఉంది వినమని తనతో చేయడానికి రెడీగా ఉన్న నిర్మాతలకి పురమాయిస్తున్నాడు.
మామూలుగా ప్రొడ్యూసర్ ఓకే అయిన తర్వాతే మిగతావన్నీ ఓకే అవుతుంటాయి. కానీ ఈ చిత్రానికి హీరోయిన్ కూడా ఓకే అయిపోయింది కానీ ప్రొడ్యూసర్ విషయంలో సస్పెన్స్ నెలకొంది. అదేంటో సంపత్ నంది ఏం చేసినా వెరైటీగానే ఉంటుంది.