దర్శకులు తమ స్క్రిప్ట్ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ తో సినిమాను తమ చిత్తానికి చుట్టేయడం, తీరా జనాలు దాన్ని చూసి, అబ్బే…అనేసాక..అప్పుడు కత్తెర్లు, బ్లేడ్లు పట్టకుని ఆపరేషన్ కు బయల్దేరడం మామూలైపోయింది. ఈ స్పీడ్ జనరేషన్ లో కూడా డిటయిల్డ్ గా మూడుగంటల సినిమా చూపిస్తే ఎవరు చూస్తారు? ఇప్పుడు లింగా పరిస్థితి అదే.
ఆ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎంత చెక్కాలో అంతా శిల్పంలా చెక్కారు. దాంతో సినిమా కొండవీటి చాంతాడంతయింది. ఇప్పుడు సినిమాను నిలబెట్టకోవడానికి కాస్త కత్తిరింపులు చేయాలని చూస్తున్నారు. ప్రారంభంలో దొంగతనం, ఫ్లాష్ బ్యాక్ లో డ్యామ్ నిర్మాణంలో నిడివి, అలా అక్కడా,అక్కడా కోసి, కనీసం ఇరవై నిమషాలన్నా తగ్గించాలనుకుంటున్నారట. సోమవారం నాటికి ఇది రెడీ చేస్తారని వినికిడి.