పవన్‌కళ్యాణ్‌.. ఈసారికింతే

గత ఏడాదిలో ఒక్క రిలీజ్‌ కూడా లేకపోయినా ఈ సంవత్సరం అభిమానులు ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన పని లేకుండా పవన్‌కళ్యాణ్‌ చిత్రం సంక్రాంతికే వచ్చేసింది. యావరేజ్‌ రిజల్ట్‌ సాధించిన ‘గోపాల గోపాల’లో పవన్‌…

గత ఏడాదిలో ఒక్క రిలీజ్‌ కూడా లేకపోయినా ఈ సంవత్సరం అభిమానులు ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన పని లేకుండా పవన్‌కళ్యాణ్‌ చిత్రం సంక్రాంతికే వచ్చేసింది. యావరేజ్‌ రిజల్ట్‌ సాధించిన ‘గోపాల గోపాల’లో పవన్‌ కనిపించింది అరగంట కంటే తక్కువే. ఈ సంవత్సరానికి పవర్‌స్టార్‌ దర్శనం అంతే అనుకోవాలి. 

పవన్‌కళ్యాణ్‌ నెక్స్‌ట్‌ సినిమా ‘గబ్బర్‌సింగ్‌ 2’ అనేది ఖరారైనా కానీ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న పవన్‌ ఇప్పట్లో షూటింగ్‌ స్టార్ట్‌ చేయడట. నడుము నొప్పితో బాధ పడుతున్న పవన్‌కి ఒక మేజర్‌ సర్జరీ అవసరమట. అమెరికా వెళ్లి సర్జరీ చేయించుకున్న అనంతరం పవన్‌కళ్యాణ్‌ ‘గబ్బర్‌సింగ్‌ 2’ మొదలు పెడతాడట. 

కాబట్టి ఎలా చూసినా ఈ ఏడాది ద్వితీయార్థంలో కానీ పవన్‌ సినిమా సెట్స్‌ మీదకి వెళ్లదు. అదే జరిగితే ఇక రిలీజ్‌ వచ్చే సంవత్సరంలోనే ఉంటుంది. అందాకా పవన్‌ ఫాన్స్‌ ‘గోపాల’ నామ స్మరణతో గడిపేయక తప్పదు మరి.