అత్తారింటికి దారేది ఊహించని విధంగా బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో.. గబ్బర్ సింగ్ 2పై అంచనాలు భీకరంగాపెరిగిపోయాయి. ఈ సినిమాకి సంబంధించి పవన్ పూర్తిగా ఫ్రీ హ్యాండ్ తీసుకొన్నాడు. కథ, స్ర్కీన్ ప్లే పవన్ సమకూర్చుకొన్నాడు. దానికి తోడు సాంకేతిక నిపుణుల ఎంపిక బాధ్యత కూడా తానే తీసుకొన్నాడు. పవన్ ఆలోచనల్ని సంపత్ కేవలం ఎగ్జిక్యూట్ చేయనున్నాడంతే.
అయితే ఈ ప్రయోగాలు ఏ మాత్రం సేఫ్ అన్నది మాత్రం ఆలోచించుకోవల్సిందే. గబ్బర్ సింగ్ కి అయితే.. దబాంగ్ అనే బేస్ ఉంది. దానికి తోడు హరీష్ సొంత తెలివితేటలు బాగా యాడ్ అయ్యాయి. హరీష్ డైలాగులు రాసుకోవడంలో దిట్ట. తన పెన్ బలం.. గబ్బర్ సింగ్లో చాలా కనిపించింది. అవన్నీ కలసే.. ఆ సినిమాని నిలబెట్టాయి.
కానీ గబ్బర్ సింగ్ 2 అలా కాదు. పూర్తిగా వన్ మ్యాన్ షో. అన్నీ పవనే చూసుకోవాలి. కేవలం పవన్ స్టామినా మీద ఈ సినిమా లాగించేయాలి. కథ, స్ర్కీన్ ప్లే అంటూ గుడుంబా శంకర్లోనూ పవన్ ఇలాంటి ప్రయత్నాలే చేశాడు. అది సత్పలితం ఇవ్వలేదు. మరి గబ్బర్ సింగ్ 2 విషయంలో ఏమవుతుందో చూడాలి.