టాలెంటెడ్ దర్శకుడే – కానీ సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు పరశురామ్. తాను చేసిన చిన్ని చిన్ని తప్పులకు పెద్ద మూల్యం చెల్లించుకొంటున్నాడు. సోలో తరవాత.. సారొచ్చారు సినిమా తీశాడు. రవితేజలాంటి మాస్ హీరోకి కాస్ల క్లాస్ టచ్ కథ చేసేసరికి ప్రేక్షకులు భరించలేకపోయారు.
ఆ తరవాత పరశురామ్ మరో సినిమా మొదలెట్టలేదు. ఇప్పుడు మళ్లీ తన హిట్ కాంబినేషన్.. నారా రోహిత్ దగ్గరకు వెళ్లిపోయారు. నారా రోహిత్ – పరశురామ్ కలయికలో సోలో వచ్చింది. కమర్షియల్‌గా ఈ సినిమా బాగానే పే చేసింది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలసి ఓ సినిమా చేస్తున్నట్టు సమాచారమ్.
ప్రస్తుతం నారా రోహిత్ ఫుల్ బిజీలో ఉన్నాడు. ప్రతినిధి విడుదలకు సిద్ధమైంది. మరో వైపు శంకర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. రౌడీ ఫెలో సెట్స్ పై ఉంది. ఇన్ని సినిమాల మధ్య ఈ కొత్త సినిమా ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తాడో చూడాలి.