'మిర్చి' సినిమాతో సంచలన విజయం అందుకున్న ప్రభాస్, ఆ సినిమాతో తన మార్కెట్‌ని బాగా పెంచేసుకున్నాడు. అయితే 'బాహుబలి' సినిమా కోసం ఎక్కువ టైమ్ కేటాయించేయడంతో ప్రభాస్ మార్కెట్ ఏమయ్యింది.? అతని పొజిషన్ ఏంటి.? అని అంతా కన్‌ఫ్యూన్‌లో పడ్డారు. పాతిక కోట్లు తీసుకుని ప్రభాస్, 'బాహుబలి'కి ఒప్పుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది ఇప్పటికీ.
''డబ్బు ముఖ్యం కాదు.. 'బాహుబలి' లాంటి అవకాశం మళ్ళీ రాదు. అందుకే ఒప్పుకున్నాను..'' అని చెప్పాడు ప్రభాస్. అయితే ప్రభాస్ ప్రయత్నం వృధా కాలేదు. 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. రాణా కారణంగా 'బాహుబలి'కి బాలీవుడ్‌లో మంచి ప్రచారం దక్కింది. రాజమౌళి సినిమాని మార్కెట్ చేసిన తీరు, తమిళ సినీ రంగంతోపాటు చాలా భాషల్లో 'బాహుబలి' టీమ్‌కి మార్కెట్‌ని పెంచిందనే చెప్పాలి.
ప్రభాస్ అంటే ఇప్పుడు పరిచయం అక్కర్లేని పేరు తమిళంలో అయినా, హిందీలో అయినా. ఇంతకన్నా ఏ హీరోకి అయినా కావాల్సిందేముంటుంది.? అందుకే, ప్రభాస్ మార్కెట్ 'బాహుబలి'తో విపరీతంగా పెరిగిందనే చెప్పాలి. అయితే అది ఎంత.? అన్నది 'బాహుబలి' కాకుండా మరో సినిమా వస్తేగానీ డిసైడ్ చెయ్యలేం.