జ్యోతిలక్ష్మి..టైటిల్ తోనే జూమ్ వంటూ క్రేజ్ తెచ్చుకున్న సినిమా. ఈ సినిమా నవల అప్పట్లో అంటే పాతికేళ్ల క్రితం ఓ సెన్సేషన్. వేశ్యను పెళ్లాడి ఉద్దరించాలనుకున్న కుర్రాడి కథ. అయితే ఇప్పుడు ఈ సినిమాను పూరి తన మార్కుతో తెరకెక్కిస్తున్నాడట.
సినిమాలో ఓ పక్క బి సి సెంటర్లకు కావాల్సిన మాస్ మసాలాలు అందిస్తూనే, మరోపక్క డైనమేట్ ల లాంటి డైలాగులను సమాజం మీద సంథించే కార్యక్రమం చేపట్టాడట. చాలా సీన్లలో పూరి డైలాగులు చురుగ్గా బాణాల్లా గుచ్చుకునేలా రాశాడట. ఇవి కేవలం క్లయిమాక్స్ లో మాత్రమే కాదు..సినిమాలో చాలా సీన్లు ఇలాగే బ్యాలన్స్ చేసే ప్రయత్నం చేసాడట.
వేశ్య బ్యాక్ డ్రాప్ లో సినిమా తీసి, మాస్ సీన్లు చొప్పించి, డబ్బులు చేసుకున్నాడనే పేరు కాకుండా, సమాజాన్ని భలే కొశ్చను చేసాడ్రా అని అనుకోవాలన్నది పూరి ఐడియా నంట. అందుకోసమే పవర్ ఫుల్ డైలాగులు వదిలాడట. చూడాలి మరి అవి ఎలా పేలతాయో?