మొత్తం మీద మనసులో మాట చెప్పేసాడు రాజమౌళి. బాహుబలి సీరీస్ తరువాత ఎవరికి సినిమా చేస్తారు అన్నదానికి దాదాపు క్లియర్ గా సమాధానం ఇచ్చాడు ఓ ఇంటర్వూలో. తనకు తారక్ (ఎన్టీఆర్) అంటే ఇష్టమని, అతనితోనే చేయాలని వుందని, అయితే ఇంకా పూర్తిగా డిసైడ్ కాలేదని అన్నాడు.
అదే విధంగా నిర్మాతల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేసారు రాజమౌళి. దానయ్యకు, కెఎల్ నారాయణకు సినిమాలు చేయాల్సిన కమిట్ మెంట్ వుందన్నారు. తనను అడగకమపోయినా, తన సన్నిహితుడు సాయి కొర్రపాటికి ఓ సినిమా చేసి తీరుతానని వెల్లడించారు. సాయితో సినిమా చేయడం తనకు కంఫర్ట్ అని ప్రకటించేసారు.
తండ్రి ఇప్పటికే రెండు మూడు కథలు చెప్పారని, అవి నచ్చలేదని రాజమౌళి వెల్లడించారు. విఎఫ్ఎక్స్ అవసరం లేని భారీ సినిమా చేయాలని అనుకుంటున్నానని, అదే సమయంలో మర్యాద రామన్న మాదిరిగా చిన్న సినిమా చేసే అవకాశం కూడా వుందని చెప్పేసారు.
మరి రాజమౌళి తన అభిమాన హీరో ఎన్టీఆర్ తోనే కనుక సినిమా ప్లాన్ చేస్తే, 2018-19 లో ఎన్టీఆర్ టాప్ లో వుంటాడు. ఇప్పటికే త్రివిక్రమ్, కొరటాలశివలతో సినిమాలు ఫిక్సయ్యాడు కదా.