రాజ మోళీ..ట్వీట్

దర్శకుడు రాజమౌళిది అతి మంచితనం. పాపం తాను ఎవరికీ చెడ్డ కాకూదనే రకం. అందుకే పాపం అన్ని సమావేశాలకు హాజరై అందర్నీ యధాశక్తి పొగడుతుంటారు. ట్విట్టర్ అక్కౌట్ కూడా ఆ దారిలోనే వెళ్తుంటుంది. సంపూర్ణేష్…

దర్శకుడు రాజమౌళిది అతి మంచితనం. పాపం తాను ఎవరికీ చెడ్డ కాకూదనే రకం. అందుకే పాపం అన్ని సమావేశాలకు హాజరై అందర్నీ యధాశక్తి పొగడుతుంటారు. ట్విట్టర్ అక్కౌట్ కూడా ఆ దారిలోనే వెళ్తుంటుంది. సంపూర్ణేష్ బాబు పై ట్వీట్ చేసి అతగాడి వెయిట్ పెంచారు. అంతా బాగానే వుంది. కానీ అతగాడి లేటెస్ట్ ట్వీట్ తోనే వచ్చింది తంటా.

ఇంతకీ ఆ ట్వీట్ ఏమిటంటే, తనకు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిన బోగట్టా ప్రకారం, బాలకృష్ణ హిందూపూర్ లో ఓటర్లకు డబ్బులు పంచడానికి అస్సలు అనుమతించలేదట. ఇదే నిజమైతే, దాన్ని తాను గౌరవిస్తానన్నది ట్వీట్ సారాంశం. ఇక్కడ రెండు విషయాలున్నాయి. విషయం తెలిసీ తెలియకుండా ట్వీట్ చేయడం. రాజమౌళి లాంటి సెలబ్రిటీలు ట్వీట్ చేస్తే మామూలుగా వుండదు. 

ఒకటి అని వారు అంటే, జనానికి చేరేసరికి అది 'వందట' అన్నట్లుగా వెళ్లిపోతుంది. రాజమౌళి..అది నిజమైతే..అని ట్వీట్ చేసింది ఎవరికీ తెలియదు. బాలకృష్ణ డబ్బులు పంచలేదు..అది చాలా గొప్ప విషయం అన్నదే మిగిలిపోతుంది. అందువల్ల రాజమౌళి లాంటి వారు ట్వీట్ చేసేటపుడు చాలా జాగ్రత్తగా వుండాలి. అందునా వేల సంఖ్యలో ఫాలోవర్లు వుంటారు వారికి. 

ఇక రెండవ సంగతి. నిన్న మొన్నటి దాకా లోక్ సత్తా తరపును ఈల ఊది ఊది అలసిపోయాడు రాజమౌళి. ఆ పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణే ఈ ఎన్నికల్లో డబ్బు మంచి నీళ్లలా ఖర్చయిందని వాపోయారు. తెలుగుదేశం పార్టీనే టికెట్ లు కోట్లకు అమ్మేసిందని పరోక్షంగా దెప్పిపోడిచాడు. మరి ఈ వ్యవహారానికి బాలయ్య దూరం అని అనుకోవడం రాజమౌళి అమాయకత్వం అనుకోవాలా?

 బాలయ్య హిందూపూర్ లోకల్ జనాలను నమ్మకుండా, తన బామ్మర్దిని తీసుకెళ్లి హిందూపూర్ లో వ్యవహారాలు నడిపించారన్నది మీడియా టాక్. అక్కడి జనాలను నమ్మకపోవడానికి, స్వంత బామ్మర్దిని తీసుకెళ్లడానికి కారణం డబ్బే కదా. డబ్బు ఖర్చులు కాకుంటే నమ్మడం,. నమ్మకపోవడం అన్న సమస్యే రాదు. స్వంత మనుషులను పెట్టుకునేది ఈ డబ్బు వ్యవహారాలు సజావుగా చేరడానికే. ఆ సంగతి సినిమా రంగంలో వుంటున్న రాజమౌళికి తెలియదని అనుకోవడానికి లేదు. మరి తెలిసీ ఈ ట్వీట్ ఎందుకోసం. 

ఎప్పటిలా అందరిదగ్గరా మంచి అనిపించుకున్నట్లే, బాబు, బాలయ్యల దగ్గరా మార్కులు కొట్టడానికి కాకుంటే, ఈల వేసిన నోటే సీదాగా పోగడలేక, ఇలా మౌస్ క్లిక్ తో ప్రచారం క్లిక్ చేయాలనుకుంటున్నారన్న మాట రాజమౌళి సారు. అయినా ఇన్ని తంటాలెందుకు, ఇన్ని లేని పోని మాటలెందుకు, తన గురువు రాఘవేంద్రరావు ఎలాగూ బాబుకు బాగా దగ్గరేగా..అదే దగ్గర రూటు అనుకోవచ్చు.