Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రవిబాబు..బ్యాక్ టు పెవిలియన్

రవిబాబు..బ్యాక్ టు పెవిలియన్

ఎప్పుడో అల్లరి అనే అల్లరి చిల్లర సినిమా తీసి, ఆ తరువాత బుద్దిగా మాంచి సినిమాలు వరుసగా మూడు నాలుగు చేసారు రవిబాబు. కానీ ఆ తరువాత కొన్ని ప్రయోగాలుచేసారు. అవి కాస్తా వికటించాయి. ఈలోగా ఎప్పుడో రవిబాబు ప్రయత్నించిన అల్లరి జోనర్ అంతకు అంతా మారిపోయి, మరీ బోల్డ్ గా తయారైపోయి, ఎటిటి అంటూ ఆన్ లైన్ విడుదల అంటూ, గూగుల్ లో బూతు సినిమాలు వెదక్కోవాల్సిన అవసరం లేకుండా చేస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో రవిబాబు కూడా ఇంకెందుకు ఆలస్యం, మనం స్టార్ట్ చేసిందే కదా, అని మళ్లీ ఎక్కడ మొదలుపెట్టారో అక్కడకు చేరిపోయారు. క్రష్ అనే పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. నూనూగు మీసాల కుర్రాళ్ల తో తీసిన సెమీ బూతు సినిమా లా వుంది. ఈ సినిమాకు సంబంధించి ముందుగా వదిలిన చిన్న విడియో బైట్ చూస్తుంటే.

రవిబాబు అల్లరి...మారుతి ఈ రోజుల్లో, బస్ స్టాప్, రోజులు మళ్లీ తిరిగి మరింత అడ్వాన్స్ గా వచ్చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ బూతు సినిమాల వరుస చూస్తుంటే.

రాష్ట్రాన్ని పున‌ర్నిర్మించుకుంటున్నాం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?