రోజా.. తమిళంలోనూ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటోంది!

ఒకవైపు ఎమ్మెల్యేగా తరచూ వార్తల్లో నిలిచే రోజా.. ఇదే సమయంలో తెలుగునాట రియాలిటీ షోలతో కూడా బిజీగా ఉందని వేరే చెప్పనక్కర్లేదు. టాప్ రేటింగ్స్ తో నడుస్తున్న ఒక రియాలిటీ షో కు ప్రధాన…

ఒకవైపు ఎమ్మెల్యేగా తరచూ వార్తల్లో నిలిచే రోజా.. ఇదే సమయంలో తెలుగునాట రియాలిటీ షోలతో కూడా బిజీగా ఉందని వేరే చెప్పనక్కర్లేదు. టాప్ రేటింగ్స్ తో నడుస్తున్న ఒక రియాలిటీ షో కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది రోజా. హీరోయిన్ గా లభించిన గుర్తింపుతో .. హీరోయిన్ గా రిటైరయ్యాకా కూడా క్రేజ్ ను రియాలిటీ షోల ద్వారా క్యాష్ చేసుకుంటున్న రోజా తన పరపతిని తమిళంలో కూడా బాగానే వాడుకుంటోంది.

తమిళ టీవీ చానళ్లలో కూడా రోజా కనిపిస్తోంది. అక్కడ ప్రసారం అయ్యే కొన్ని రియాలిటీ షోలకు రోజా జడ్జిగా వ్యవహరిస్తూ.. సత్తా చాటుతోంది. హీరోయిన్ గా రోజా తెలుగు కన్నా తమిళంలోనే ఎక్కువ బిజీగా ఉండిందని వేరే చెప్పనక్కర్లేదు. తమిళ టాప్ హీరోలతో నటిస్తూ గ్లామర్ ను ఒలకపోయడంతో పాటు.. కోలీవుడ్ లో నటనకు అవకాశం ఉన్న సినిమాల్లోనూ నటించింది రోజా. ఇలాంటి నేపథ్యంలో ఆలనాటి ఈ హీరోయిన్ ను రియాలిటీ షోలకు గెస్టులుగా పిలిపించుకొంటున్నాయి తమిళ చానళ్లు.

ఎలాగూ చిత్తూరు వ్యక్తి కావడం, తమిళంలో అనేక సినిమాల్లో నటించిన నేపథ్య ఉంది కాబట్టి.. లాంగ్వేజ్ విషయంలోనూ రోజాకు ఇబ్బంది లేదు. అనర్గళంగా తమిళం మాట్లాడుతూ.. ఆ షోలను రక్తి కట్టిస్తోంది ఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. మరి ఇటు పొలిటీషియన్ గా, అటు క్యారెక్టర్ ఆర్టిస్టు వేషాల్లో కనిపిస్తూ.. ఇంకోవైపు తెలుగు, తమిళ భాషల్లో రియాలిటీ షోలతో చాలా బిజీగానే ఉన్నట్టుంది రోజా సెల్వమణి.