ఏప్రిల్ మూడో వారంలో విడుదలవుతుంది రుద్రమదేవి అన్నది ఆ మధ్య వినిపించిన కబురు. హడావుడిగా, వున్నట్లుండి రెండుచోట్ల అడియో ఫంక్షన్లు చేస్తే, ఇది నిజమే కాబోలు అనుకున్నారు. కానీ ఇప్పడు పరిస్థితి చూస్తుంటే ఎప్పుడువస్తుందో తెలియడం లేదు. షూటింగ్, నిర్మాణ సమయంలో అప్పుడప్పుడు అప్ డేట్ సమాచారం అందించిన యూనిట్ ఇప్పుడు గమ్మున వుంది.
సాధారంణంగా అడియో ఫంక్షన్ అయిపోయిన రెండు మూడు వారాల్లో సినిమా రావడం టాలీవుడ్ సంప్రదాయం. కానీ అలా జరిగేలా కనిపించడం లేదు. ఏప్రిల్ లో రుద్రమదేవి విడుదల అనుమానమే. ఇంకా లండన్ లో రీరికార్డింగ్ జరుగుతోంది అంటున్నారు. మరి ఇవన్నీ ఎప్పుడు పూర్తయి, సినిమా సెన్సారు ముందుకు వస్తుందో?
మరోపక్క రుద్రమదేవి బిజినెస్ వ్యవహారాలు కూడా అంతంత మాత్రంగా వున్నాయని వినికిడి. ఎంత బన్నీని ఫోకస్ చేస్తూ ట్రయిలర్లు, టీజర్లు ఇచ్చినా, హిస్టారికల్ మూవీ అంటే బయ్యర్లు అంతగా ఆసక్తి కనబర్చలేకపోతున్నారని వినికిడి. అసలు మార్కెట్ లో ఆసక్తి కలిగించడం కోసమే, ఐమాక్స్ లో ట్రయిలర్ విడుదల, ఆపై హీరోయిన్ల గ్లామర్ చిత్రాలు, అడియో ఫంక్షన్లు హడావుడి చేసారు. కానీ రిజల్ట్ ఆశించినంత లేదని తెలుస్తోంది.
మరి ఇవన్నీ దాటుకుని మేలో అయినా రుద్రమదేవి ప్రేక్షకులను పలకరిస్తుందేమో చూడాలి.