తెలుగులో లక్కీ హీరోయిన్ ట్యాగ్ అందుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్. 90శాతం హిట్ పర్సంటేజ్ ఉంది. ఇప్పుడు ఆమె హీరోయినా, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా రెడీ అవుతోంది. ప్రస్తుతం సంయుక్త మీనన్ చేతిలో అర డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఇలాంటి టైమ్‌లో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ఒకే చేసింది ఆమె. ఈ సినిమాను రాజేష్ దండా నిర్మిస్తున్నారు. యోగి దర్శకుడు.
ఈ సినిమా కోసం రాక్షసి అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసి ఉంచారు. ఈ సినిమాలో సంయుక్త పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తోంది. ఈ పాత్ర చాలా వయోలెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది. అందుకే రాక్షసి అనే టైటిల్ ఒకటి రిజిస్టర్ చేసి ఉంచారు. టైటిల్ నెగటివ్‌గా ఉంటుందా? జానర్ మీద అనుమానం కలిగిస్తుందా అన్న సందేహాలు మేకర్స్‌కు ఉన్నాయి. అందుకే ఇంకా టైటిల్‌ను పూర్తిగా ఫిక్స్ చేయలేదు.
మరింత మంచి టైటిల్ ఏదైనా దొరికితే రాక్షసి టైటిల్‌ను పక్కన పెడతారు. లేదంటే దాన్నే ఖరారు చేస్తారు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంటోంది. ఇప్పటి హీరోయిన్లలో ఇలా నిర్మాణ భాగస్వామ్యం తీసుకున్నది సంయుక్తనే.
Beauty of Ayurveda…