చైతూ-శోభిత.. తొలిప్రేమ కబుర్లు

పెళ్లి తర్వాత తొలిసారి ఓ మీడియా సంస్థకు సంయుక్తంగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ జంట, పెళ్లి విషయాల్ని కూడా పంచుకుంది.

సమంత నుంచి విడిపోయిన తర్వాత మరో అమ్మాయితో మింగిల్ అవ్వడానికి నాగచైతన్య ఎక్కువ టైమ్ తీసుకోలేదు. కొన్ని నెలల వ్యవధిలోనే శోభితాకు కనెక్ట్ అయ్యాడు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

తామిద్దరం విడిపోతున్నట్టు నాగచైతన్య-సమంత 2021 అక్టోబర్ లో అధికారికంగా ప్రకటించారు. మరుసటి ఏడాది అంటే, 2022 ఏప్రిల్ లో నాగచైతన్య-శోభిత ఓ ఈవెంట్ కోసం పబ్లిక్ గా కలిశారు. అయితే అప్పటికే ఇద్దరికీ లంచ్ డేట్ పూర్తయింది.

నాగచైతన్య-శోభిత ఇనస్టాగ్రామ్ ద్వారా కలుసుకున్నారు. ఆ తర్వాత ఆమెను కలిసేందుకు ముంబయి వెళ్లాడు నాగచైతన్య. ఆ టైమ్ లో శోభిత ముంబయిలో ఉండేది, నాగచైతన్య హైదరాబాద్ లో ఉండేవాడు.

అలా తొలి డేటింగ్ కోసం హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్లాడు చైతూ. శోభితను లంచ్ కు తీసుకెళ్లాడు. అక్కడ్నుంచి ఇద్దరూ రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ వస్తున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కర్నాటకలోని ఓ పార్క్ కు వెళ్లారు. కలిసి కొంత సమయం గడిపారు, ఒకరికొకరు గోరింటాకు కూడా పెట్టుకున్నారంట. అలా ఇద్దరూ ప్రేమలో మునిగిపోయారు.

ఆ తర్వాత నూతన సంవత్సర వేడుకలకు శోభితను ఆహ్వానించింది అక్కినేని కుటుంబం. ఆ తర్వాత స్వయంగా నాగచైతన్య వెళ్లి, శోభిత తల్లిదండ్రులకు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. పెద్దలు అంగీకరించడంతో, ఆ వెంటనే నిశ్చితార్థం, పెళ్లి చకచకా జరిగిపోయాయి.

ఈ విషయాలన్నీ స్వయంగా నాగచైతన్య-శోభిత బయటపెట్టారు. పెళ్లి తర్వాత తొలిసారి ఓ మీడియా సంస్థకు సంయుక్తంగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ జంట, పెళ్లి విషయాల్ని కూడా పంచుకుంది.

గుడిలో పెళ్లి చేసుకున్న అనుభూతి వచ్చేందుకు, అన్నపూర్ణ స్టుడియోలో టెంపుల్ సెట్ వేయించుకున్నారట. పెళ్లికి 300 మందిని ఆహ్వానించినప్పటికీ, తామిద్దరమే ఉన్నామనే ఫీలింగ్ తో పెళ్లి చేసుకున్నామని తెలిపింది ఈ జంట. ఇక ఆహుతుల కోసం తమిళనాడు, కర్నాటక, కేరళ, ఆంధ్రా, తెలంగాణ వంటకాలతో 5 ఫుడ్ కోర్టులు ఏర్పాటుచేశారట. వీటికి అదనంగా నాగచైతన్యకు చెందిన రెస్టారెంట్ నుంచి జపనీస్ ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటుచేశారు.

2 Replies to “చైతూ-శోభిత.. తొలిప్రేమ కబుర్లు”

Comments are closed.