Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శాతకర్ణికి నైజాంలో ఝలక్

శాతకర్ణికి నైజాంలో ఝలక్

ఆంధ్రలో ఖైదీ నెం 150 సభకు పర్మిషన్ ఇవ్వనందుకు నైజాంలో శాతకర్ణిపై పగ తీర్చుకుంటారట. నిన్న మొన్నటి దాకా ఖైదీ సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవహారంలో అల్లు అరవింద్ జోక్యం చేసుకోలేదు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. అరవింద్ ఎంటర్ అయ్యారు. నైజాంలో ఏసియన్ డిస్ట్రిబ్యూటర్స్ సినిమాను కొన్నా, దాన్ని గీతా ద్వారానే పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఓ అగ్రిమెంట్ కుదిరింది.

నైజాంలో అరవింద్ ఖైదీ సినిమా విషయంలో చిన్న వాటా తీసుకున్నారని కూడా వినిపిస్తోంది. దీంతో నైజాంలో దిల్ రాజు తన సిన్మా శతమానం భవతి విడుదల చేయగా మిగిలిన థియేటర్లు, అలాగే గీతాకు వున్న థియేటర్లు అన్నీ ఇప్పుడు ఖైదీ పరమవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ అర్బన్ ఏరియాలో మాగ్జిమమ్ థయేటర్లు ఖైదీకే రిజర్వ్ చేసే కార్యక్రమం స్టార్ట్ అయిపోయిందట.

అలాగే నైజాంలో మాగ్జిమమ్ ప్రీమియమ్ థియేటర్లు అన్నీ ఖైదీకే కేటాయించేలా పావులు నప్పేసారట. ఈ మేరకు సొషల్ నెట్ వర్క్ లో కూడా ఆంధ్రలో మీరు పర్మిషన్ ఇవ్వలేదు. నైజాంలో మేం థియేటర్లు ఇవ్వం అనే టైపులో ప్రచారం స్టార్ట్ అయిపోయింది.

అయితే ఆంధ్ర విషయానికి వస్తే, అక్కడ కూడా ఇప్పుడు ఖైదీ ఎడ్జ్ పెరిగింది. యువి సంస్థ, గీతా, దిల్ రాజు, చాలా వరకు ఖైదీవైపు మొగ్గేసారు. సురేష్ బాబు థియేటర్లు మాత్రం శాతకర్ణి వైపు వున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?