నాగచైతన్య విషయంలో చేసిన పొరపాటు అఖిల్ విషయంలో చేయకూడదని గట్టిగా డిసైడయ్యాడు నాగార్జున. జోష్ బాధ్యతను ఓ కొత్త దర్శకుడికి ఇచ్చి తప్పు చేశానే, అని ఆయన ఇప్పటికీ బాధపడుతుంటారు. అందుకే సిసింద్రీ విషయంలో అతి జాగ్రత్తలు పోతున్నారు. యేడాది నుంచి ఈ ప్రాజెక్ట్ ఫైనలైజ్ కాలేదంటే నాగ్ ఎంత జాగ్రత్త పడుతున్నాడో అర్థమవుతోంది.
ఆఖరికి ఆయన సీనియర్ దర్శకులనూ నమ్మడం లేదు. కథ ఓకే చేయడానికి చాలా టైమ్ తీసుకొంటున్నారు. అఖిల్ కోసం దాదాపు ఏడు కథలు సిద్ధమయ్యాయట. వాటిలో ఒక దానిపై కూడా నాగ్ ముద్ర పడలేదు. అఖిల్‌కి ఎలాంటి కథ నప్పుతుంది? అనే విషయంపై వర్క్ షాపులు జరుగుతున్నాయి. అఖిల్ కొన్ని ట్రైల్ షూట్స్‌లోనూ పాల్గంటున్నాడు. వీటి కోసం భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నట్టు సమాచారమ్.
అన్నీ ఓకే అయ్యాకే… సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్తాం, యేడాది ఆలస్యమైనా కొంపలేం మునిగిపోవు… అని నాగ్ చెబుతున్నాడట. ఆలస్యం, అమృతం విషం అనే సంగతి నాగ్ మర్చిపోయాడో ఏమిటో..?