చాలా కాలం క్రితం రామానాయుడు నిర్మించిన సోగ్గాడు ఓ బ్లాక్ బస్టర్. ఆ తరువాత అదే టైటిల్ ట్రయ్ చేసినా క్లిక్ కాలేదు. మళ్లీ సోగ్గాడే చిన్ని నాయనా అంటూ నాగ్ ఈ సంక్రాంతికి వచ్చాడు. అది మళ్లీ అదే రేంజ్ హిట్ అయ్యేలా కనిపిస్తోంది. ఉభయ రాష్ట్రాల్లో, టికెట్ లు కావాలని రికమెండేషన్ జరుగుతున్నా, లేదా బ్లాక్ వుందన్నా అది ఒక్క సోగ్గాడు చిన్ని నాయనా కుమాత్రమే. సంక్రాంతి సినిమాల్లో ఫ్యామిలీలను థియేటర్లకు లాగగలిగిన సబ్జెక్ట్ ఇది ఒక్కటే.
అందువల్ల థియేటర్లలో మరో రెండు వారాలు కచ్చితంగా వుండే సత్తా వుంది. వాస్తవానికి అన్నిసినిమాలు ఈ వారం కూడా థియేటర్లో వుంటాయి. అందులో సందేహం లేదు. కానీ ఎటొచ్చీ కొన్ని చోట్ల స్క్రీన్ల్ పెరుగుతాయి..కొన్ని చోట్ల తగ్గుతాయి. అంతే తప్ప ఓవరాల్ గా స్క్రీన్ల సంఖ్య అలాగే వుంటుంది.
అయితే ఏ మాత్రం వేరే సినిమాలు స్క్రీన్ లు లేచినా, అవి సోగ్గాడు ఖాతాలోకి వెళ్లిపోతాయి. డిక్టేటర్..నాన్నకు ప్రేమతో థియేటర్లు మార్చుకనే అవకాశం వుంది. ఇది విడుదల కాని చోట అది..అది విడుదల కాని చోట ఇది వచ్చి చేరతాయి. వీటన్నింటికి దూరంగా వున్న థియేటర్లలో అలా ఏ రేంజ్ లో వుందో అదే రేంజ్ లో ముందుకు వెళ్తుంది ఎక్స్ ప్రెస్ రాజా.
ఈ తరహా పరిస్థితి వల్ల ఏమిటి ఫలితం అంటే ఈ శుక్రవారం సినిమాల విడుదల వుండకపోచ్చు. అంతే.