టాలీవుడ్ థియేటర్ల రగడ మళ్లీ తెరపైకి వచ్చింది. పండగకు నాలుగు సినిమాలు విడుదల అవుతుండడంతో థియేటర్ల సమస్య తప్పలేదు. అందులో ఈసారి ఇంకో ప్రత్యేకత వుంది. పెద్ద ఎగ్జిబిటర్లలో ఒకరైన దిల్ రాజు స్వంత సినిమా ఎఫ్ 2 విడుదల అవుతోంది. అదే విధంగా మరో పెద్ద ఎగ్జిబిటర్స్ అయిన యువి క్రియేషన్స్ కొనుగోలు చేసిన వినయ విధేయరామ విడుదల అవుతోంది. ఇంకోపక్క ఎన్వీప్రసాద్, సురేష్ బాబు, ఏషియన్ సునీల్ లాంటి భారీ ఎగ్జిబిటర్లు అండగా వున్న ఎన్టీఆర్ బయోపిక్ విడుదల అవుతోంది.
ఇలాంటి నేపథ్యంలో రజనీకాంత్ పేట సినిమా కూడా వస్తోంది. దానికి ఇలాంటి బ్యాకింగ్ లు లేవు. పైగా రజనీ సినిమాలకు వున్నది ఫ్లాపుల ట్రాక్ రికార్డ్. ఇలాంటి టైమ్ లో థియేటర్ల యజమానులు మంచి సినిమా తమ థియేటర్లలోకి రావాలనుకుంటారు కానీ, డవుట్ వుండే సినిమా కాదు. ఎందుకంటే గత నెలన్నరగా థియేటర్లు ఆకలితో అలమటిస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ఎవరైనా సీజన్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు.
దీంతో రజనీకాంత్ సినిమా పేటకు థియేటర్లు దొరకలేదు. దీంతో ఆ సినిమా ఫంక్షన్ లో తెలుగు వెర్షన్ నిర్మాత అశోక్ కుమార్ కాస్త బరస్ట్ అయ్యారు. అది ఏ మేరకు అంటే, నయీంను కాల్చిపారేసినట్లు థియేటర్ల మాఫియాను కాల్చి పారేయాలని అనేంత వరకు. అయితే ఆయన ఈ మాఫియా అంటూ దిల్ రాజు, అల్లు అరవింద్, యువి వంశీల పేర్లు మాత్రమే ప్రస్తావించడం విశేషం.
నైజాం మొత్తం తనచేతుల్లో వుంచుకున్న ఆసియన్ సునీల్-సురేష్ బాబు ద్వయాన్ని ఏమీ అనలేదు. అలాగే కృష్ణా, ఈస్ట్, విశాఖ ప్రాంతాల్లో థియేటర్లు ఎక్కువ సంఖ్యలో వుంచుకున్న సురేష్ బాబును ప్రస్తావించలేదు. ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా సినిమాలు వుండకుండా సురేష్ బాబు, ఏషియన్ సునీల్ ప్రయత్నించారని, కానీ దిల్ రాజు, యువి వంశీ వినలేదని ఇండస్ట్రీలో గుసగుసలు వున్నాయి.
నైజాంలో బయోపిక్ ను సునీల్ నే తీసుకున్నారు. ఇప్పుడు అశోక్ కుమార్ సునీల్, సురేష్ బాబును వదిలి మిగిలిన వారిని టార్గెట్ చేయడం చూస్తుంటే వీటివెనుక డిస్ట్రిబ్యూటర్ల రాజకీయాలు కూడా వున్నట్లు కనిపిస్తోంది. పైగా ఇండస్ట్రీలో ఆధిపత్యం వున్న సామాజిక వర్గానికి చెందని వారినే టార్గెట్ చేయడం కూడా విశేషం.
జనసేన అన్ని స్థానాల్లో పోటీ పవన్ కళ్యాణ్ ధైర్యమేంటి?
అటు జనం.. ఇటు భయం, పవన్ ఒంటరిగా వెళ్లాలి.. ఇదే అభిమానుల కోరిక!