చిరంజీవి, పవన్ కల్యాణ్ హీరోలుగా మెగా మల్టీస్టారర్ మూవీని ప్రకటించాడు సుబ్బరామిరెడ్డి. త్రివిక్రమ్ ఈ సినిమాను డైరక్ట్ చేయబోతున్నాడంటూ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఆ ప్రకటన తర్వాత సైలెంట్ అయిపోయిన టీఎస్ఆర్.. ఈ సినిమా ఆగిపోలేదని, పవన్ తో సంప్రదింపులు జరిపానని, తప్పకుండా సెట్స్ పైకి వస్తుందని మరోసారి ప్రకటించారు. కానీ రెడ్డిగారు ఎన్ని ప్రకటనలు చేసినా సినిమా సెట్స్ పైకి వచ్చేది మాత్రం డౌటే. దీనికి ప్రధానంగా 3 కారణాలున్నాయి.
రీజన్-1
ఈ మెగా మల్టీస్టారర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు ఎవరికీ అడ్వాన్స్ లు ఇవ్వలేదట సుబ్బరామిరెడ్డి. పవన్, చిరంజీవిని పక్కనపెడితే కనీసం కథ సిద్ధంచేయాల్సిన త్రివిక్రమ్ కు అయినా అడ్వాన్స్ చెల్లించి, అగ్రిమెంట్ చేసుకోవాలి కదా. అలాంటివేం జరగలేదని తెలుస్తోంది. కేవలం నోటిమాట మీద సినిమా ఓకే అయిందట. రెడ్డిగారు అడగడంతో అంతా సరే అంటే సరే అనేశారు.
రీజన్-2
ప్రస్తుతం పవన్ కు సినిమాలు చేసే ఇంట్రెస్ట్ లేదు. త్రివిక్రమ్ తో చేస్తున్న మూవీతో సినిమాలకు చిన్న బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఎట్ లీస్ట్ 2019 ఎన్నికలు పూర్తయ్యే వరకైనా సినిమాల్ని పక్కనపెట్టి, రాజకీయాలపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడు. సో.. ఇలాంటి టైమ్ లో మెగా మల్టీస్టారర్ సెట్స్ పైకి వస్తుందని అనుకోవడం భ్రమే.
రీజన్-3
ఒకవేళ పవన్ సినిమా చేయాలనుకున్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు సుబ్బరామిరెడ్డి సినిమాకు కాల్షీట్లు కేటాయించే పొజిషన్ లో లేడు. ఎందుకంటే ఏఎం రత్నం సినిమాతో పాటు, మైత్రీ మూవీ మేకర్స్ కు ఇచ్చిన మాట పెండింగ్ లోనే ఉంది. అటు చిరంజీవిది కూడా ఇదే పరిస్థితి. ఇంతవరకు ఉయ్యాలవాడ ప్రాజెక్టునే సెట్స్ పైకి తీసుకురాలేదు చిరు.
సో.. టీఎస్ఆర్ నిర్మాతగా పవన్-చిరంజీవి హీరోలుగా ప్రకటించిన మల్టీస్టారర్ మూవీ చెప్పుకోవడానికి ఓ క్రేజీ ప్రాజెక్టుగా మిగిలిపోతుందే తప్ప, సెట్స్ పైకి మాత్రం ఇప్పట్లో రాదు.